Na cheli rojave song lyrics in telugu - Roja - నా చెలి రోజావే.. నాలో ఉన్నావే.. లిరిక్స్

Na cheli rojave song lyrics in telugu

నా చెలి రోజావే.. నాలో ఉన్నావే.. నిన్నే.. తలిచేనే.. నేనే..

నా చెలి రోజావే.. నాలో ఉన్నావే.. నిన్నే.. తలిచేనే.. నేనే..

కళ్ళల్లో నీవే.. కన్నీటా నీవే.. కనుమూస్తే నీవే.. యదలో నిండేవే..

కనిపించవో.. అందించవో.. తోడు

నా చెలి రోజావే.. నాలో ఉన్నావే.. నిన్నే.. తలిచేనే.. నేనే..

గాలి నన్ను తాకినా.. నిన్ను తాకు జ్ఞాపకం గులాబీలు పూసినా.. చిలిపి నవ్వు జ్ఞాపకం అలలు పొంగి పారితే.. చెలియ పలుకు జ్ఞాపకం మేఘమాల సాగితే.. మోహకథలు జ్ఞాపకం మనసు లేకపోతే.. మనిషి ఎందుకంటా.. నీవు లేకపోతే.. బతుకు దండగంటా..

కనిపించవో.. అందించవో.. తోడు

నా చెలి రోజావే.. నాలో ఉన్నావే.. నిన్నే.. తలిచేనే.. నేనే..

కళ్ళల్లో నీవే.. కన్నీటా నీవే.. కనుమూస్తే నీవే.. యదలో నిండేవే..

కనిపించవో.. అందించవో.. తోడు

చెలియ చెంత లేదులే.. చల్ల గాలి ఆగిపో మమత దూరమాయనే.. చందమామ దాగిపో కురుల సిరులు లేవులే.. పూల వనం వాడిపో తోడు లేదు గగనమా.. చుక్క లాగ రాలిపో మనసులోని మాట.. ఆలకించలేవా.. విడిపోని నీడ.. నిన్ను చేరనీవ

కనిపించవో.. అందించవో.. తోడు

నా చెలి రోజావే.. నాలో ఉన్నావే.. నిన్నే.. తలిచేనే.. నేనే..

కళ్ళల్లో నీవే.. కన్నీటా నీవే.. కనుమూస్తే నీవే.. యదలో నిండేవే.. కనిపించవో.. అందించవో.. తోడు

చిత్రం: రోజా గానం: ఎస్పీ బాలు రచన: రాజశ్రీ సంగీతం: ఏ ఆర్ రెహ్మాన్

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)

Please Support