
Jack Movie Review in Telugu
నటీనటులు: సిద్దూ జొన్నలగడ్డ, వైష్ణవీ చైతన్య, ప్రకాశ్ రాజ్, నరేష్, రవి ప్రకాశ్, రాహుల్ దేవ్, బ్రహ్మాజీ... దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్ నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్ మ్యూజిక్: సురేష్ బొబ్బిలి, అచ్చు రాజమణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సామ్ సీసీ సినిమాటోగ్రఫి: విజయ్ కే చక్రవర్తి ఎడిటింగ్: నవీన్ నూలి రిలీజ్ తేదీ : 2025 ఏప్రిల్ 10
డీజే టిల్లు సీక్వెన్స్ లతో మంచి ఫాంలో ఉన్న సిద్ధు జొన్నలగడ్డ "జాక్" గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మన ముందుకు వచ్చాడు, అయితే వరుస విజయాలు ఉన్న సిద్దు, చాలా కాలంగా సరైన హిట్ లేని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక కొత్త జోనర్ లో నటించడం ఎంతోమంది సినిమా ప్రేక్షకులను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మధ్య కాలంలో స్పై జోనర్ లో వచ్చినసినిమాలేవీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. ఈ సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది.
కథ:
సిద్దు ఈ సినిమాలో టైటిల్ రోల్ "జాక్", ఒక యంగ్ మాన్, తన లైఫ్ అంతా ఫన్ తో ఉండాలి అనుకునే కుర్రాడు, ఒక టైం లో RAW లో జాయిన్ అవ్వాలని అనుకుంటాడు, ఇంటర్వ్యూ కి వెళ్లిన తర్వాత సెలెక్ట్ అవ్వక ముందే కొన్ని పరిస్థితుల వల్ల ఒక మిషన్ మొదలు పెట్టాల్సి వస్తుంది.. అక్కడ నుండి కథలో చాలా పాత్రలు ఎంటర్ అవుతాయి, అలాగే హీరోయిన్ వైష్ణవి, అఫ్సాన్ ఒక ప్రైవేట్ డిటెక్టివ్, సిద్దు తండ్రి నరేష్ అసలు తన కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని వైష్ణవిని డిటెక్టివ్ గా నియమిస్తాడు. ఇక ఈ పాత్రల మధ్య, అసలు ఉగ్రవాదులకు, సిద్ధు కు మధ్యలో ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ.
ఎలా ఉందంటే:
సిద్దు ది ఫన్ క్యారెక్టర్, RAW అనేది ఇండియా లో పవర్ఫుల్ సంస్థ, ఈ రెండింటిని మిక్స్ చేసి ప్రేక్షకులను మెప్పించాలంటే అంత సులభం కాదు. అక్కడ దర్శకుడు కూడా ఫెయిల్ అయ్యాడు. సిద్ధు మంచి ఎంటర్టైనర్, ఇక్కడ స్పై క్యారెక్టర్ తో మిళితం చేయటం వలన క్లారిటీ తక్కువగా కన్ఫ్యూషన్ ఎక్కువగా ఉంది, అలాగే మొదటి 20-30 నిమిషాలు బోరింగ్ గా కూడా ఉంది, బేసిక్ గా ప్రేక్షకులు సిద్దు నుండి కామెడీ మరియు పంచ్ డైలాగులు ఎక్స్పెక్ట్ చేసే థియేటర్ కి వస్తారు, కానీ ఇక్కడ అది పూర్తిగామిస్ అయింది. సీరియస్నెస్ మరియు కామెడీ మిక్స్ అయి కొంత నిరుత్సాహం మాత్రం మిగులుతుంది. దర్శకుడికి, హీరోకి ఉన్న ఇమేజ్ ని దృష్టలో పెట్టుకొని లవ్ స్టోరీ, పంచ్ డైలాగ్స్, ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం పూర్తిగా ఇక్కడ ఇంకేదో సినిమా కనిపిస్తుంది.
సినిమాని సినిమా లాగే చూడాలి అంటారు కానీ మరీ RAW సబ్జెక్ట్ తీసుకొని ఇలా కామెడీ గా తీయడం నిజంగా కామెడీ, సినిమా లిబర్టీ ఉండాలి కానీ అది ఎంటర్టైనింగ్ గా ఉండాలి.
ఎవరెలా చేశారంటే:
సిద్దు ముందు సినిమాలలాగే యాక్టింగ్ విషయంలో ఎక్కడా తక్కువ చేయలేదు. కాకపోతే సిద్దు నుంచి ఆశించే సినిమా ఇది కాదు. ఇక వైష్ణవి చైతన్య నుండి బేబీ సినిమా తరువాత మంచి రోల్ లో చూడాలి అని ఎంతో మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు, కానీ ఒక డిటెక్టివ్ క్యారెక్టర్ అని తప్ప పెద్దగా ఇంపార్టెన్స్ ఏం ఉండదు, అందంగా ఉంది అందంగా చేసింది అంతే అంతకు మించి చెప్పటానికి ఏమీ లేదు. బేసిక్ గా భాస్కర్ గారి సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ స్పెషల్ గా ఉంటుంది, ఇక్కడ అది మిస్ అయింది. RAW ఆఫీసర్ గా ప్రకాష్ రాజ్, IPS ఆఫీసర్ గా సుబ్బరాజు, విలన్ క్యారెక్టర్ లో రాహుల్ దేవ్, హీరో తండ్రిగా నరేష్, ఒక చిన్న అతిథి పాత్రలో బిందు చంద్రమౌళి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ క్యారెక్టర్ పరంగా న్యాయం చేశారు. హీరో పక్కన ఒక మంచి కామెడీ క్యారెక్టర్ పెట్టి ఉంటే బాగుండేదేమో.
చివరగా:
భాస్కర్ నుండి ఒక లవ్ స్టోరీ, ఫ్యామిలీ వాల్యూస్. సిద్ధు నుండి మాస్ కామెడీ పంచ్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేసి పోతే అస్సలు ఎంజాయ్ చేయలేరు. ఏదో అనుకొని వస్తే ఏదో చూసి వెళ్తారు. అనుకున్నట్టు రాయలేకనో లేదా తీయలేకనో, అటు యాక్షన్ అని కాకుండా కామెడీ అని కాకుండా, కమర్షియల్ గా తీద్దాం అనుకొని తీసిన ఒక సినిమా. ఈ సినిమా చూడటానికి OTT బెస్ట్.