
Jabilamma Neeku Antha Kopama Song Lyrics in Telugu
పల్లవి: జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా నీ వెండి వెన్నెల్లే.. ఎండల్లె మండితే.. అల్లాడిపోదా రేయి ఆపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా ఓఓ ఓఓఓ
చరణం 1: చిగురు పెదవి పైన.. చిరు నవ్వై చేరాలనుకున్న చెలియ మనసులోన.. సిరి మువ్వై ఆడాలనుకున్న ఉన్న మాట చెప్పలేని గుండెలో.. విన్నపాలు వినపడలేదా హారతిచ్చి స్వాగతించు కల్లలో.. ప్రేమ కాంతి కనపడలేదా మరీ అంత దూరమా.. కలలు కన్న తీరమా జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా ఓఓ ఓఓఓ
చరణం 2: మనసు చూడవమ్మ.. కొలువుందో లేదో నీ బోమ్మ మనవి ఆలకించి.. మనసిస్తే చాలే చిలకమ్మ ప్రాణమున్న పాలరాతి శిల్పమా.. ప్రేమ నీడ చేరుకోని పంతమా తోడు కోరి దగ్గరైతే దోషమా.. తియ్యనైన స్నేహమంటె ద్వేషమా ఒక్కసారి నవ్వుమా.. నమ్ముకున్నా నేస్తమా జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా
నీ వెండి వెన్నెల్లే.. ఎండల్లె మండితే.. అల్లాడిపోదా రేయి.. ఆపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా ఓఓ ఓఓఓ
చిత్రం: పెళ్లి సంగీతం: ఎస్ ఏ రాజ్ కుమార్ గానం: ఎస్పీ బాలు