రివ్యూ (review): గుడ్ బాడ్ అగ్లీ మూవీ రివ్యూ తెలుగులో | Good Bad Ugly Movie Review in Telugu


Good Bad Ugly Movie Review In Telugu

నటీనటులు: అజిత్ కుమార్, త్రిష కృష్ణన్, అర్జున్ దాస్, జాకీ ష్రాఫ్, ప్రసన్న, కార్తీక్ దేవ్, రెడిన్ కింగ్స్లీ, యోగి బాబు, సిమ్రాన్ మరియు ఇతరులు దర్శకుడు: అధిక్ రవిచంద్రన్ నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంగీత దర్శకుడు: జివి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రాఫర్: అభినందన్ రామానుజం ఎడిటర్: విజయ్ వేలుకుట్టి నిర్మాణం : మైత్రీ మూవీ మేకర్స్ విడుదల తేదీ: 10 ఏప్రిల్ 2025 వ్యవధి: 2:20 గంటలు

పుష్ప 2 తర్వాత మైత్రి మూవీ మేకర్స్ నుండి వచ్చిన సినిమా "గుడ్ బాడ్ అగ్లీ". అజిత్, త్రిష జంటగా థియేటర్స్ లో ఏప్రిల్ 10, 2025 న తెలుగులో కూడా విడుదల చేసారు.

అజిత్ కుమార్, త్రిష ఇద్దరూ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఆదరణ ఉన్న నటులు. ఇద్దరు కూడా ఈ మధ్య కాలంలో వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ వారు నటించిన సినిమా అంటే ఒక ప్రత్యేకమైన ఇంటరెస్ట్ కలిగేలా గుర్తింపుని సంపాదించుకున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన నాలుగవ సినిమా ఈ "గుడ్ బాడ్ అగ్లీ". ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

AK అలియాస్ రెడ్ డ్రాగన్ (అజిత్) ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్. తన జైలు జీవితం ముగిసాక తన గతాన్ని వదిలేసి కుటుంబంతో హ్యాపీగా ఉందాం అనుకుంటాడు, భార్య రమ్య (త్రిష), కొడుకు విహాన్ (కార్తీక్ దేవ్) సంతోషం కోసం కొన్ని రోజులు ముందుగానే జైల్ నుండి బయటికి వస్తాడు, కానీ అంతలోనే తన కొడుకు ఒక డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటాడు, ఈ కేసు నిజమా లేక ఎవరైనా ఇరికించారా? తన కొడుకుని కాపాడే క్రమంలో మళ్లీ గ్యాంగ్స్టర్ గా మారుతాడా లేదా? అసలు ఇలా ఇరికించింది ఎవరు? చివరికి ఏమైంది అనేది ఈ కథ.

ఎలా ఉందంటే:

"ఇది కేవలం అజిత్ అభిమానుల కోసం తీసిన సినిమా"

స్టోరీ కంటే హీరో ఎలివేషన్స్ ఎక్కువ. సింపుల్ సబ్జెక్ట్, ఒక చిన్నపాయింట్ తో సినిమా మొత్తం నడిపించడం అంత ఇంటరెస్టింగ్ గా అనిపించదు. నిజానికి గ్యాంగ్స్టర్ సినిమా అనగానే ఒక ఫ్లాష్ బ్యాక్, హీరో ఫ్యామిలీ, రివెంజ్ ఇలా ఉండడం ప్రేక్షకులు ఊహించగలిగేదే. కాకపోతే వింటేజ్ స్టైల్ అజిత్ క్యారెక్టర్, మధ్యలో కొన్ని యాక్షన్ సీన్స్ అలాగే కొన్ని క్యారెక్టర్స్ మధ్యలో ఎంటర్ అవ్వడంతో మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయితే అక్కడక్కడా ఉంది. అందుకే అజిత్ అభిమానులకైతే ఈ సినిమా నచ్చుతుంది. కానీ సగటు ప్రేక్షకుడికి మాత్రం ఒకసారి చూస్తే చూడొచ్చు అనిపించేలా ఉంది.

ఎవరెలా చేశారంటే:

హీరో అజిత్ గ్యాంగ్స్టర్ మరియు ఒక ఫాదర్ గా రెండు క్యారెక్టర్స్ స్టైలిష్ మరియు వయలెంట్ గా సాగుతాయి. ముఖ్యంగా వింటేజ్ లుక్ అదిరిపోయింది. ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అది మాత్రం దర్శకుడు ఇచ్చి పడేశాడు. ఎలివేషన్స్ కి మాత్రం లోటు ఉండదు. అజిత్ కి భార్య రమ్యగా త్రిష, చెప్పాల్సిన పని లేదు తన అందం మరియు నటన తో ఆకట్టుకుంది, తక్కువ నిడివి ఉన్న పాత్ర. ఇక తన వాయిస్ తో అందరి మతి పోగొట్టే అర్జున్ దాస్ ఇందులో ద్విపాత్రాభినేయంతో ఆకట్టుకున్నాడు. ఇక అర్జున్ దేవ్, ప్రియా ప్రకాష్, ప్రభు, ప్రసన్న, జాకీ ష్రాఫ్ ఇలా అన్ని క్యారెక్టర్స్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

మధ్యలో ఒక క్యారెక్టర్ తో అందరూ సర్ప్రైస్ ఫీల్ అవుతారు, చెప్తే బాగోదు అందరూ సినిమా చూసి తెలుసుకోవాలి, కాకపోతే ఆ క్యారెక్టర్ వచ్చిన కొంత సేపు ఫన్ మామూలుగా ఉండదు, . సంగీతం విషయానికి వస్తే GV ప్రకాష్ కుమార్, పాటలు పెద్దగా చెప్పుకోవడానికి లేదు, సినిమా మొదటి నుండి ముగిసే వరకు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ చాల బాగుంది అక్కడక్కడ మాత్రం తేలిపోయింది, వింటేజ్ సినిమా BGM మెప్పిస్తుంది. కాకపోతే తెలుగు వెర్షన్ లో తమిళ పాట అలాగే ఎందుకు పెట్టారో అర్థం అవ్వలేదు. ఫైనల్ గా దర్శకుడు అదిక్ రవి చంద్రన్, ఈయన ముందే ఫిక్స్ అయి కథ రాసుకున్నాడేమో, కథ కంటే ఎలివేషన్స్ ముఖ్యం అని, అలాగే సింపుల్ కథని ఎలివేషన్స్ తో నింపి ముగించాడు. ఫాన్స్ మాత్రం ఎంజాయ్ చేసేలా తీశాడు. సినిమాటోగ్రఫీ, టెక్నికల్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి.

చివరగా:

గుడ్ కి బ్యాడ్ కి మధ్యలో, అగ్లీ మాత్రం అసలే కాదు అనేలా ఉంది. ఫాన్స్ కి పండగ. సాధారణ ప్రేక్షకులకి వన్ టైం వాచ్.

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support