
Review: The Secret of the Shiledars
నటీనటులు : రాజీవ్ ఖండేల్వాల్, గౌరవ్ అమ్లాని, సాయి తమ్హంకర్, ఆశిష్ విద్యార్థి, కన్నణ్ అరుణాచలం, దిలిప్ ప్రభావల్కర్ తదితరులు. సంగీతం : ట్రాయ్ - ఆరిఫ్ సినిమాటోగ్రఫీ : సుకేష్ విశ్వనాథ్ ఎడిటర్ : అనికేత్ కరన్డికర్, సాహిల్ విధాతె దర్శకుడు : ఆదిత్య సర్పోట్దర్ నిర్మాతలు : నితిన్ వైద్య, రాహుల్ తడాని, జయిద్ బిన్ షాహెబ్ విడుదల తేదీ : జనవరి 31, 2025 స్ట్రీమింగ్ : జియో హాట్ స్టార్
ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మీద తెరకెక్కించిన సినిమా "చావా", ఈ సినిమా దేశం అంతటా విడుదలైన అన్ని భాషలలో మంచి విజయాన్ని సాధించింది. అదే సమయంలో శంభాజీ తండ్రిగారైన ఛత్రపతి శివాజీ గారి సింహాసనం మరియు నిధి మీద ఈ వెబ్ సిరీస్ ని తీసుకొచ్చారు, అందువల్ల చావా సినిమా రెస్పాన్స్ కూడా ఈ వెబ్ సిరీస్ కి మంచి క్రేజ్ తెచ్చిపెట్టే అవకాశం ఉంది, అయితే ఇది ఒక వెబ్ సిరీస్, ఆరు ఎపిసోడ్స్ గా తీసుకొచ్చారు.
కథ:
రవి బట్ ( రాజీవ్ కండేల్వాల్ ) ఒక డాక్టర్, ఈయన చిన్నతనంలో కుటుంబంతో కలిసి వెళ్తున్నపుడు తల్లితండ్రులు హత్య చేయబడతారు, అలా ఈ సిరీస్ మొదలవుతుంది, హీరోకి చరిత్రలు & అడ్వెంచర్ ట్రిప్స్ అంటే ఇష్టం, రవి బట్ మరియు అతని తమ్ముడు ఆదిత్య ( గౌరవ్)తో కలిసి రాయఘడ్ కోటకి ట్రిప్ కి వెళ్తాడు, ఆ తర్వాత ప్రియాల్ దేశ్ పాండే (సాయి తమాన్కర్) ఆహ్వానం మేరకు ఒక మీటింగ్ కి వెళ్తాడు.
అక్కడే జస్టిస్ కృష్ణ దీక్షిత్ (దిలీప్ ప్రభావల్కర్)తో పరిచయం ఏర్పడుతుంది, నిజానికి జడ్జి దీక్షిత్ ఛత్రపతి శివాజీకి సంబంధించిన రహస్య నిధికి కాపలా ఉండే శిలేదార్ల వంశానికి చెందిన వాడు, ఆయనకి కాన్సర్ ఉండడం వల్ల రవి కూడా శిలేదార్ల వంశానికి చెందిన వాడే అని తెలుసుకొని అతని సహాయం కోరుతాడు. కాకపోతే ఈ నిధిని కనిపెట్టడానికి ఇంకో వర్గం కూడా వీళ్ళను కనిపెడుతూ ఉంటారు, ఈ విషయాలు అన్ని దీక్షిత్ గారు హీరో కి చెప్పే సమయానికి దీక్షిత్ గారు హత్య చేయబడతారు. హత్య కి ముందు దీక్షిత్, రవి భట్ కి నిధికి సంభందించిన రహస్యాలు ఉన్న ఒక డైరీ ఇస్తాడు. దీక్షిత్ హత్య వల్ల రవి భట్ కూడా ఒక అనుమానితుడిగా మిగిలి పోతాడు, ఆ తర్వాత తన తండ్రి కూడా ఈ నిధిని కాపాడే క్రమంలో హత్య చేయబడ్డాడు అని తెలుసుకొని ఆ నిధిని కాపాడడానికి తన తమ్ముడు ఆది తో కలిసి బయలుదేరుతాడు.
గవర్నర్ రామ చంద్రన్ (కన్నణ్ అరుణాచలం) నిధి వేటలో ఉన్నాడు అని తెలుసుకొని తమ పూర్వీకులైన శిలేదార్స్ మరియు డైరీలో ఉన్న క్లూస్ ఆధారంగా పలు షాకింగ్ సీక్రెట్స్ తెలుసుకుంటారు. మరి ఈ నిధి అన్వేషణలో వారు విజయం సాధిస్తారా.. లేదా..? అనేది ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.
ఆశిష్ విద్యార్ధి మన తెలుగు వాళ్ళకి సుపరిచితుడు అతడి క్యారెక్టర్ కొంచెం సస్పెన్స్.
ఎలా ఉందంటే:
చావా సినిమా చూసాక కొంత మంది ఇలాంటి నిధి కోసం వెతికారు అని కొన్ని పుకార్లు అయితే వచ్చాయి, చరిత్రలో కూడా మొఘల్స్ దాడి చేస్తారు అని తెలిసి రాజ్యంలో ఉన్న సంపద అంతా దాచే వారు అని మనం కూడా విన్నాం, ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ తో ఈ వెబ్ సిరీస్ తీశారు, మామూలుగానే చరిత్రలు మరియు నిధి అన్వేషణలతో సాగే కథలు అంటే జనాలు పిచ్చిగా చూసేస్తారు, ఇక్కడ కూడా దర్శకుడు మంచి థ్రిల్లింగ్ సీన్స్ తో ఇంటరెస్టింగ్ గా ఉండేలా తీసాడు ప్రతి ఎపిసోడ్ ని.
నటి నటులు & సాంకేతిక నిపుణుల పనితీరు:
ఆశిష్ విద్యార్ధి మన తెలుగు వాళ్ళకి సుపరిచితుడు అతడి క్యారెక్టర్ బాగుంది, ఇక రాజీవ్ ఖండేల్వాల్ హీరోగా మంచి పాత్రతో ఆకట్టుకున్నాడు, ఆదిత్యగా గౌరవ్, ప్రియాల్ గా సాయి తమాన్కర్ బాగా చేసారు, దిలీప్ ప్రభావల్కర్ జడ్జి శ్రీ కృష్ణకాంత్ దీక్షిత్ గా బాగా చేసారు, ఇక మిగిలిన పాత్రలు అన్ని పెద్దగా చెప్పాల్సిన పని లేదు.
ముఖ్యంగా ఇక్కడ దర్శకుడు ఆదిత్య సర్పోట్దర్ గురించి ఎక్కువగా చెప్పుకోవాలి, మొదటి ఎపిసోడ్ నుండి కథని థ్రిల్లింగ్ గా నడిపించాడు.
సంగీతం అంత చెప్పడానికి ఏం లేదు, అలాగే సినిమాటోగ్రఫీ కూడా, గ్రాఫిక్స్ మరియు ఎడిటింగ్ లో కొంత మైనస్ అని చెప్పొచ్చు.
మొత్తంగా వెబ్ సిరీస్ ఎలా ఉంది అంటే:
100 % అందరూ కలిసి కుటుంబంతో సహా సంతోషంగా చూడదగ్గ మంచి వెబ్ సిరీస్, ఈ సిరీస్ మొదటి నుండి థ్రిల్లింగ్ గానే సాగుతుంది, కాకపోతే కొన్ని కొన్ని సీన్స్ మాత్రం ముందే ఊహించేలా ఉంటాయి, హీరో ప్రతి విషయాన్నీ ఈజీగా ఊహిస్తుంటే థ్రిల్ మిస్ అయింది అని చెప్పొచ్చు, ఇంకా కొంచెం సస్పెన్స్ మరియు ఎపిసోడ్స్ తీయొచ్చు ఈ కథని, అలాగే క్లైమాక్స్ మాత్రం కొంచెం నిరాశ కలిగిస్తుంది, ముగించిన విధానం ఇంకా కొంత క్లారిటీ తో ఉండాల్సింది అంతే.
చివరగా ఇది ఇక అడ్వెంచరస్ హిస్టారికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, మన జియో హాట్ స్టార్ లో తెలుగు లో కూడా అందుబాటులో ఉంది.