రివ్యూ : వినరో భాగ్యము విష్ణు కథ (Vinaro Bhagyamu Vishnu Katha)


Vinaro Bhagyamu Vishnu Katha Telugu Review

చిత్రం: వినరో భాగ్యము విష్ణు కథ తారాగణం: కిరణ్ అబ్బవరం, కాశ్మీర, మురళి శర్మ, ఆమని, పమ్మి సాయిరాం, ప్రవీణ్ తదితరులు సంగీతం: చేతన్ భరద్వాజ్ కెమెరా: డేనియల్ విశ్వాస్ ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేశ్ నిర్మాత: బన్నీ వాస్ (GA2 pictures) దర్శకత్వం: మురళి కిషోర్ అబ్బూరు విడుదల: ఫిబ్రవరి 18,2023

"రాజా వారు రాణి గారు" సినిమాతో ఆరంగేట్రం చేసి "SR కల్యాణ మండపం" సినిమాతో మంచి హిట్ టాక్ తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన సినిమా "వినరో భాగ్యము విష్ణు కథ". టైటిల్ వినడానికి ఏదో భక్తి ప్రధానమైన సినిమాలా అనిపించింది, తర్వాత ట్రైలర్ చూసాక ఇంటరెస్టింగ్ గా అనిపించింది, పైగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన సినిమా అవటం వలన మంచి అంచనాలతో రిలీజ్ ఐంది ఈ సినిమా.

విషయంలోకి వెళ్తే విష్ణు(కిరణ్) తిరుపతిలో ఉంటాడు, ఎవరికి ఏ అవసరం వచ్చినా సాయం చేసే క్యారెక్టర్, దర్శన(కాశ్మీర) ఒక యూట్యూబర్, తన ఫోన్ నెంబర్ కి అటు ఇటు ఉన్న నెంబర్స్ కి ఫోన్ చేసి "ఏ డే విత్ నైబర్ నెంబర్" అనే వీడియో చేసి అప్లోడ్ చేయ్యాలన్నది ఆమె ఆలోచన. ఆ క్రమంలో ఆమెకు అటు నంబర్ విష్ణు అయితే ఇటు నెంబర్ శర్మ (మురళి శర్మ).

ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ తో ఇంటరెస్టింగ్ గా కథ మొదలవుతుంది. కాకపోతే దర్శకుడు కథను సరిగా హ్యాండిల్ చేయలేక పోయాడు అనిపించింది. ఏదో తీద్దాం అనుకొని ఇంకేదో తీసినట్టు ఉంటుంది సినిమా, అయితే సినిమా ఆద్యంతం ఈ ముగ్గురి చుట్టే తిరుగుతుంది.

అనుకున్నట్టుగానే కిరణ్ అబ్బవరం తీసుకున్న ప్రతీ పాత్రకి న్యాయం చేస్తాడనే చెప్పాలి, dialogue డెలివరీ కానీ, ఫైట్ sequences కానీ బాగున్నాయి. ఇక కాశ్మీర తన క్యారెక్టర్ వరకు పర్లేదు అన్నట్టే యాక్ట్ చేసింది, క్యూట్ లుక్ తో ఉంది. ఇక మురళి శర్మ గారు, ఈయన గురించి చెప్పాల్సిన పని లేదు,ఎలాంటి పాత్ర అయినా అలవోకగా చేయగల ఆర్టిస్ట్, మంచి డైలాగ్ డెలివరీ & కామెడీ టైమింగ్ తో యాక్ట్ చేసారు. పమ్మి సాయి మాత్రం ఈ సినిమాలో ఇంకా కొంచెం బెటర్ గా చేసి ఉండొచ్చు.

చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ బాగుంది, బాక్గ్రౌండ్ స్కోర్ చక్కగా అందించాడు, ముఖ్యంగా గోపురం ఫైట్ సీన్ చాలా బాగా ఉంది, అలాగే సినిమాటోగ్రఫీ డానియల్ విశ్వాస్ వర్క్ బాగుంది, తిరుపతి లొకేషన్స్ & కొన్ని షాట్స్ చూడడానికి బాగున్నాయి. ఇక డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బూరు, ఈయన తీసుకున్న కాన్సెప్ట్ కొత్తగా ఉంది కానీ తీసే విధానంలో చాలా confuse అయ్యాడు అనిపించింది. కామెడీ మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా, సెకండ్ హాఫ్ పర్వా లేదు. మొత్తంగా సినిమా బాగుంది అన్నట్టే ఉంది.

కొత్త కథ, కిరణ్ అబ్బవరం యాక్టింగ్, మురళి శర్మ కామెడీ & యాక్టింగ్, కొన్ని ట్విస్టులు. మొత్తానికి పర్వాలేదు. చూడతగ్గ సినిమానే, కాక పోతే expectations లేకుండా వెళ్లి చూడండి అంతే.

Rating: 3.0 / 5.0

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support