
Konaseema Thugs Movie Review
టైటిల్ : కోనసీమ థగ్స్ నటీనటులు: హ్రిదు హరూన్, సింహ, ఆర్ కె సురేష్, మునీష్ కాంత్, అనస్వర రాజన్, శరత్ అప్పని మరియు తదితరులు. దర్శకత్వం: బృంద సంగీతం: శామ్ సి ఎస్ సినిమాటోగ్రఫీ: ప్రీయేష్ గురుస్వామి నిర్మాణ సంస్థ: హెచ్ ఆర్ పిక్చర్స్ - రియా శిబు విడుదల తేది: ఫిబ్రవరి 24, 2023
డ్యాన్స్ మాస్టర్ అయిన బృంద దర్శకురాలిగా మారి తెరకెక్కించిన రెండో సినిమా “తగ్స్”. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో “కోనసీమ తగ్స్” అనే పేరుతో అనువదించి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసింది.
కథలోకి వెళ్తే, శేషు(హృదు హరూన్) ఒక అనాధ. కాకినాడ రౌడీ పెద్దిరెడ్డి దగ్గర పని చేస్తుంటాడు. అక్కడే ఉంటున్న అమ్మాయి కోయిల (అనస్వర రాజన్)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదామనుకున్న సమయంలో తను పనిచేసే రౌడీ తమ్ముడు ఆ అమ్మాయి మీద ఆశ పడడం, ఒకానొక సందర్భంలో అనుకోకుండా అతడి హత్యకి కారణమవుతాడు.
కాకినాడ జైలులో దొర (బాబీ సింహ), మధు (మునీష్ కాంత్)తో పాటు రకరకాల మనుషులు పరిచయం అవుతారు. వీరందరితో కలిసి జైలు నుంచి పారిపోవడానికి శేషు ఒక ప్లాన్ వేస్తాడు. జైలు గదిలో సొరంగం తవ్వి దాని గుండా పారిపోయేందుకు ప్రయత్నిస్తారు, చివరికి వాళ్లు తప్పించుకున్నారా? లేక దొరికిపోయారా? శేషు చేసిన నేరం ఏంటి? జైలు సిబ్బంది శేషుని ఎందుకు చంపాలనుకుంటుంది? కోయిల, శేషు కలిశారా లేదా? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే.. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ.. ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే సన్నివేశాలతో ఈ సినిమా సాగుతుంది. జైలు నుంచి తప్పించుకునే సీన్స్, అందుకు హీరో వేసే ఎత్తుగడలు, మధ్య మధ్యలో కొంత కామెడీ , ఇలా ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టనివ్వకుండా చక్కగా చిత్రీకరించారు బృంద మాస్టర్ గారు. అయితే శేషు లవ్‌స్టోరీతో పాటు దొర(బాబీ సింహా) ఎందుకు జైలులో పడ్డారో తప్ప ఫస్టాఫ్‌లో ఏమీ ఉండదు. ప్రీ ఇంటర్వెల్ నుండి అసలు సినిమా మొదలవుతుంది, అక్కడి నుండి కొంత వేగం పుంజుకుంటుంది, ఇంటర్వెల్ బ్లాక్ సెకండాఫ్ మీద ఆసక్తిని పెంచుతుంది.
హీరో హ్రిదు హరూన్‌కి ఇది తొలి సినిమా అయినా చాలా చక్కగా నటించాడు అని చెప్పొచ్చు, యాక్షన్స్ సీన్స్ అయితే చాలా natural గా చేసాడు, ఫ్యూచర్ ఉన్న కుర్రాడు. హీరోగా దొర పాత్రలో బాబీ సింహా జీవించేశాడు, డైలాగ్స్ పెద్దగా లేకున్నా బాబీ మాత్రం సినిమాకు ప్లస్. ఇక కోయిల పాత్రకు అనస్వర రాజన్ న్యాయం చేసింది. పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో చక్కగా నటించింది, దొంగతనం కేసులో జైలుకు వచ్చిన మధుగా మునీష్ కాంత్ తనదైన కామెడీతో నవ్వించాడు.
ఇక్కడ డైరెక్టర్ ఎంత ప్లస్సో అంత మైనస్, ఆవిడ ఆలోచనతో తీసిన విధానం బాగుంది కానీ అది ప్రేక్షకులకి ఏ మేరకు అర్థం అవుతుందా అనేది ఆలోచించ లేక పోయారు, కట్ షాట్స్ తీయడం వల్ల కొంత అయోమయానికి లోను అవుతారు, ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ సినిమాటోగ్రాఫర్ ప్రియేశ్ గురుస్వామి నిజంగా పెద్ద ప్లస్ పాయింట్, ఆయన తీసిన షాట్స్ కానీ, లొకేషన్స్ కానీ, ఉన్న కొద్ది లొకేషన్స్ ని కుడా చక్కగా వాడుకొని మంచి output ని అందించారు. శామ్ సి. ఎస్ సంగీతం బాగాలేదు కానీ కొన్ని ఎలేవేషన్ సీన్స్ కి bgm బాగుంది.
ప్లస్ పాయింట్స్:
హీరో డైరెక్షన్ ప్రియేశ్ సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
సాగదీసే కథ
పర్లేదు అంతే, ఎంకరేజ్ చేద్దాం అనే ఆలోచన ఉంటే తప్ప చూడతగ్గ సినిమా అయితే కాదు ( Not recommended for theater, we had plenty of movies & web series to watch on OTT).