
Das ka dhamki movie review
నటీనటులు: విశ్వక్ సేన్, నివేతా పెత్తురాజ్, రావు రమేష్, రోహిణి , అజయ్, హైపర్ ఆది, అక్షర గౌడ, జబర్దస్త్ మహేష్ తదితరులు. సంగీత దర్శకులు: లియోన్ జేమ్స్ సినిమాటోగ్రఫీ: దినేష్ కె బాబు ఎడిటర్: అన్వర్ అలీ దర్శకుడు : విశ్వక్ సేన్ నిర్మాతలు: కరాటే రాజు విడుదల తేదీ : మార్చి 22, 2023 Rating : 3 / 5.0
అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా చిత్రాలతో ఫామ్ లోకి వచ్చిన విశ్వక్ సేన్ హీరోగా నటించడమే కాక, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం “దాస్ కా ధమ్కీ”, హీరోయిన్ గా నివేత పేతురాజ్ నటించింది.
కథ :
హీరో (కృష్ణ దాస్) తల్లితండ్రులు చిన్నప్పుడే చనిపోతారు, అనాథలా పెరిగిన కృష్ణ దాస్ పెద్దయ్యాక ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో హైపర్ ఆది, మహేష్ లతో కలిసి వెయిటర్ గా పని చేస్తూ ఉంటాడు. తాను లైఫ్ లో ఒక గొప్ప వాడిగా బతకాలని అనుకుంటూ ఉంటాడు, ఒక రోజు అదే హోటల్ కి వచ్చిన కీర్తి (నివేత పేతురాజ్)ని చూసి ప్రేమలో పడుతాడు, కాకపోతే తాను వెయిటర్ అన్న విషయం మాత్రం చెప్పడు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే విశ్వక్ ద్విపాత్రాభినయం. ఎస్ ఆర్ ఫార్మా చైర్మన్ గా డాక్టర్ సంజయ్ రుద్ర (మరో విశ్వక్ సేన్) తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేది లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. కృష్ణ దాస్ నివేత దగ్గర తాను సంజయ్ రుద్ర అనే పేరు వాడుకొని లవ్ చేస్తాడు, కాకపోతే కీర్తికి ఆ విషయం తెలిసి ఛీ కొట్టి వెళ్ళిపోతుంది. అప్పుడే తన జాబ్ కూడా పోతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామంలో కృష్ణ లైఫ్ లోకి సిద్దార్థ్ మల్హోత్రా (రావు రమేష్) ఎంట్రీ ఇస్తాడు, సిద్దార్థ్ మల్హోత్రా కొన్ని విషయాలు చెప్పి తన ఫామిలీ కోసం, మరియు సంజయ్ రుద్ర ఆశయం కోసం సంజయ్ స్థానంలోకి నువ్వు రావాలని కోరుతాడు, సంజయ్ స్థానంలోకి వచ్చాక కృష్ణ దాస్ జీవితంలో జరిగే మార్పులు ఏంటి? అసలు సంజయ్ ఏమయ్యాడు? కృష్ణ మరియు కీర్తి ప్రేమ పరిస్థితి ఏంటి?? ఇవి అన్ని తెలుసుకోవాలి అంటే దాస్ కి ధమ్కీ సినిమా చూడాల్సిందే.
ఇద్దరు ఒకేలా ఉండే వ్యక్తుల మధ్య సాగే కథ ఇది, ఫస్ట్ హాఫ్ లో వెయిటర్ గా కృష్ణ దాస్ స్టోరీ సాగుతుంది,అలాగే తన ఫ్రెండ్స్ ఐన హైపర్ ఆది & మహేష్ మధ్య కామెడీ సన్నివేశాలు, కీర్తితో లవ్ ట్రాక్ అలాగే తాను డబ్బున్న వ్యక్తి గా నటించడానికి పడే కష్టాలు, కొంత ఎమోషనల్ డ్రామా ఇంటర్వెల్ ముందు సీన్స్ లో, ఇలా ఫస్ట్ హాఫ్ సాగుతుంది. సంజయ్ ప్లేస్ లో కృష్ణ వచ్చాక ఏం జరుగుతుంది, సంజయ్ ప్లేస్ లోకి కృష్ణ రావడం వెనకాల గల స్టోరీ, మధ్య మధ్య కొంత పనికి రాని సీన్ లతో సెకండ్ హాఫ్ సాగుతుంది, ఇక్కడ కొంత స్టోరీ చూస్తుంటే ఇంతకు ముందు కొన్ని సినిమాలు గుర్తొస్తాయి, కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకులు ఈజీగా గెస్ చేయగలరు, కేవలం క్లైమాక్స్ కోసం సెకండ్ హాఫ్ సాగుతుంది, శృతి విషయంలో ఒక సస్పెన్స్ మాత్రం బాగుంది. హైప్ ఇచ్చిన రేంజ్ లో సెకండాఫ్ అనిపించదు. ట్విస్ట్ లు ఉన్నాయి కానీ ఇన్ని ట్విస్టులు ఆడియెన్స్ కి విసుగు కూడా రావొచ్చు అని ఊహించి ఉండరు.
నటి-నటులు & సాంకేతిక వర్గం పని తీరు:
హీరోగా ఈ మధ్య కొన్ని హిట్లు కొట్టాడు విశ్వక్, అలాగే ప్రతి స్టోరీని డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకుంటూ ప్రేక్షకులను థియేటర్ కి రప్పిస్తున్నాడు, ఫలక్నుమా దాస్ తర్వాత తన దర్శకత్వంలో ఈ సినిమా చేసాడు. రెండు డిఫెరెంట్ పాత్రలు ఇక్కడ, ఒకటి ఏమో లవ్ & కామెడీ రోల్ లాగ ఉంటె ఇంకొకటి ఏమో రాయల్ లుక్ తో పాటు కొంత ప్రతినాయక పాత్రలా ఉంటుంది. రెండు షేడ్స్ లో కూడా మంచి వేరియేషన్స్ ని ఎమోషన్స్ ని ప్రెసెంట్ చేసాడు.
ఇక హీరోయిన్ నివేతా తన గత సినిమా పాగల్ తర్వాత ఇందులో విశ్వక్ తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీ తో చేసింది.
ఒక సస్పెన్స్ ఉంది తప్ప చెప్పుకోదగ్గ సీన్స్ లేవు. ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికీ మంచి ఫన్ ఇచ్చారు, హైపర్ ఆది, మహేష్ లతో విశ్వక్ కామెడీ సీన్స్ హిలేరియస్ గా ఉంటాయి. కథ పరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. మనం గతంలో చూసిన డ్యూయల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్ లో సినిమా కనిపిస్తుంది.
లియోన్ జేమ్స్ సంగీతం సినిమాలో ట్రీట్ ఇస్తుంది. పడిపోయిందే పిల్ల పాట ప్రేక్షకులని విదుదలకి ముందే అలరించింది, సోషల్ మీడియా లో హైప్ ఇచ్చిన పాట, అలాగే దినేష్ కే బాబు సినిమాటోగ్రఫీ బాగుంది.
సినిమా నిర్మాణ పరంగా బాగుంది. ఇక సినిమాని విశ్వక్ సేన్ స్వయంగా డైరెక్షన్ చేసిన సంగతి తెలిసిందే. ఇది వరకు కూడా తాను డైరెక్టర్ గా చేసాడు కానీ ఈ సినిమాకి మాత్రం ఫలకనామ దాస్ సినిమాలా తన పనితనం లేదనే చెప్పాలి, ట్విస్ట్ లు చాలా వరకు ముందే తెలిసిపోయేలా ఉన్నాయి, ఇంకాస్త స్టోరీ మీద దృష్టి పెట్టి ఉంటె ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేది.
కథ తప్పిస్తే సినిమా మాత్రం ఎంటర్టైనింగ్ గా ఉందని చెప్పొచ్చు, విశ్వక్ & నివేత కాంబినేషన్ బాగుంది, ఈ వీకెండ్ కి మాత్రం వెళ్లి చూడొచ్చు పక్కాగా, పాత కథని కొత్తగా చూసే సినిమా ఇది అంతే.