
Siri Vennela: Jagamantha Kutumbam Nadi
పల్లవి : జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాదీ! జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే.. సన్యాసం సూన్యం నాదేలే
చరణం 1 : కవినై.. కవితనై.. భార్యనై.. భర్తనై.. కవినై.. కవితనై.. భార్యనై.. భర్తనై.. మల్లెల దారిలో.. మంచు ఎడారిలో.. మల్లెల దారిలో.. మంచు ఎడారిలో పన్నీటి జయగీతాల.. కన్నీటి జలపాతాల.. నాతో నేను అనుగమిస్తూ.. నాతొ నేనే రమిస్తూ.. ఒంటరినై.. అనవరతం.. కంటున్నాను నిరంతరం.. కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని.. రంగుల్నీ.. రంగవల్లుల్నీ.. కావ్య కన్యల్ని.. ఆడ పిల్లల్ని.. జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాదీ..
చరణం 2 : మింటికి కంటిని నేనై.. కంటన మంటను నేనై.. మింటికి కంటిని నేనై.. కంటన మంటను నేనై.. మంటల మాటున వెన్నెల నేనై.. వెన్నెల పూతల మంటను నేనై.. రవినై శశినై.. దివమై నిషినై.. నాతొ నేను సహగమిస్తూ.. నాతొ నేనే రమిస్తూ.. ఒంటరినై ప్రతినిమిషం.. కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల.. హరినాల్ని హరినాల.. చరణాల్ని చరణాల చలనాన కానరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని.. జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాదీ..
చరణం 3 : గాలి పల్లకీలోన తరలి నా పాటా పాప ఊరేగి వెడలె.. గొంతు వాకిలిని మూసి మరలి తాను మూగబోయి నా గుండె మిగిలే.. నా హృదయమే నా లోగిలి.. నా హృదయమే నా పాటకి తల్లి.. నా హృదయమే నాకు ఆలి.. నా హృదయములో ఇది సినివాళి.. జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాదీ..