
Test movie review in Telugu
"టెస్ట్" 2 గంటల 25 నిమిషాల నిడివి తో డైరెక్ట్ గా OTT ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది.
కథ:
హైడ్రో ఫ్యూయల్ అనే కాన్సెప్ట్ తో అంటే పెట్రోల్ తో కాకుండా నీటితో నడిచే ఇంజిన్ ని మార్కెట్ లోకి తేవాలనే సొంత ప్రయత్నం చేస్తుంటాడు శరవణ అలియాస్ హీరో మాధవన్, అప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతుంటాడు. అతనికి భార్యగా నాయన తార పిల్లల కోసం కలవర పడుతూ ఉంటుంది. మరోవైపు అర్జున్ గా సిద్ధార్థ్ క్రికెట్ మ్యాచ్ గెలవాలని.. ఇలా వీళ్ళ ఆశయాలు ఏమయ్యాయి అన్నది స్టోరీ.
విశ్లేషణ:
ఈ టెస్ట్ ప్రేక్షకుల పేషన్సీకి టెస్ట్ పెడుతుంది. మంచి పొటెన్షియల్ ఉన్న స్టోరీ లైన్ తీసుకొని ఫస్ట్ హాఫ్ అంతా అవసరానికి మించి సాగతీతతో స్లో ఫస్ట్ హాఫ్ నడిపారు. సెకండ్ హాఫ్ లో మాధవన్ గారి క్యారెక్టర్ బాగుంది దానికి తగ్గట్టుగా తన యాక్టింగ్ మెప్పిస్తుంది. సెకండ్ హాఫ్ అక్కడక్కడా బాగానే ఉన్నా కానీ సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ కి ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం, లాజిక్స్ లాంటివి ఏమీ పట్టించుకోకుండా కథ గమనం, స్లో నర్రేషన్, లాస్ట్ లో నిరాశ కి గురిచేసేలా ముగింపు,. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెద్ద మైనస్. సినిమా ఎగ్జిక్యూషన్ పక్కన పెడితే ముందు చెప్పినట్లు స్టోరీ లో మంచి పొటెన్షియల్ ఉంది కాబట్టి కేవలం కథ ఏంటో తెలుసుకోవటం కోసం అయితే ఒకసారి చూడొచ్చు. ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలి అంటే ఆ స్లో పేస్ లో ఈ మూవీని చూడాలంటే మాత్రం బాగా ఓపిక కావాలి.
ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు.
ప్లస్ పాయింట్స్:
మాధవన్, నాయన తార, సిద్ధార్థ్ వీళ్ళ ముగ్గురి నటన బాగుంది. ముఖ్యంగా మాధవన్ గారిది. ఇక లిమిటెడ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో మీరా జస్మిన్ గారు పర్వాలేదు అనిపిస్తారు. మాధవన్ గారి కష్టాల్ని అతను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఈ ఒక్క పోర్షన్స్ ని ఫస్ట్ హాఫ్ లో బాగా ఎగ్జిక్యూట్ చేసారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయ్. నేపథ్య సంగీతం అసలు బాగాలేదు. పాటలు బాగానే ఉన్నాయి.
మైనస్ పాయింట్స్:
అసలు లాజిక్స్ అయితే పెద్దగా ఏం ఉండవు. సినిమాలో క్యాంటీన్ మూసి తొమ్మిది నెలలు అయినా కానీ భార్యకు తెలియకపోవడం, అంత పెద్ద క్రికెట్ ప్లేయర్ తన రిఫరెన్సెస్ కూడా వాడకుండా ఇక్కడ ఏం చెప్తే అది చేయడం, భర్త కష్టాల్లో ఉన్నాడని కూడా చూడకుండా పిల్లల కోసం ఆలోచించడం, కిడ్నాప్ అయిన కొడుకు ఆచూకి కోసం ఎవరు అడగకపోవడం, లాస్ట్ లో ఒక ముగ్గురిని చంపేయడం, అసలు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో... ఈ స్టోరీకి మాధవన్, నయనతార, సిద్ధార్థ్ వీల్లే అక్కర్లేదు వేరే చిన్న యాక్టర్స్ పెట్టినా సరిపోయేది.
సంగీతం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. కంపోజర్ కి కూడా సీన్స్ చూస్తుంటే ఇంట్రెస్ట్ రాలేనట్టు ఉంది. సినిమాలో ఒక్క హైలైట్ కూడా సీన్ కూడా లేదు. ట్రైలర్ చూసి క్రికెట్ మ్యాచెస్ పెద్దగా ఉంటాయేమో అని ఆశపడితే అవీ ఉండవు.. ఒక్కో మ్యాచ్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి.
సినిమా కథాపరంగా మంచి స్కోప్ ఉంది. చెత్త సినిమా అని చెప్పలేం కానీ బాగా స్లో పేస్ లో నడిచే ఒక బిలో యావరేజ్ సినిమా అని చెప్పొచ్చు. స్టోరీ కోసం చూస్తే ఒకసారి చూడొచ్చు సీన్స్ ఇంకా బెటర్ గా ఉండేలా చూసుకుంటే బాగుండేది.
చివరగా ఒక్కమాటలో చెప్పాలంటే.. "టెస్ట్" ఈ సినిమా మీ పేషన్సీకి ఒక పెద్ద టెస్ట్.