ఆస్కార్ స్టేజిపై లైవ్‌లో 'నాటు నాటు' పాట!!!


Natu Natu Song from RRR Movie

ఆస్కార్ స్టేజిపై లైవ్‌లో 'నాటు నాటు' పాట.. తెలుగు వారి ఖాతాలో మరో ఘనత.. ఆస్కార్ స్టేజిపై లైవ్‌లో 'నాటు నాటు' పాట!!!

భారత చలన చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన 'RRR' సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కబోతోంది.. RRR సినిమాలోని 'నాటు నాటు' పాటను ఆస్కార్స్ 2023 వేదికపై సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ లైవ్‌లో పాడనున్నారు. ఈ విషయాన్ని అకాడమీ స్వయంగా ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది..

ఇప్పటికే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో 'నాటు నాటు' పాట ఆస్కార్స్‌కు నామినేట్ అయింది.

ఈ పాటలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ చేసిన డ్యాన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి... ఈ పాటను లిరిసిస్ట్ చంద్రబోస్ రచించగా సంగీత దర్శకుడు MM కీరవాణి కంపోజ్ చేశారు.ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు.

ఇప్పటికే ఎన్నో అవార్డులు సాధించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ అరుదైన ఘనతను కూడా అందుకోవడంతో తెలుగు ప్రేక్షకులే కాకుండా దేశం మొత్తం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మన భారతీయ కాలమానం ప్రకారం.. మార్చి 13, సోమవారం ఉదయం తెల్లవారు జామున ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఐదు సాంగ్స్ నామినేట్ అయ్యాయి. అందులో వాఖండా ఫరెవర్'లో రిహానా పాడిన 'లిఫ్ట్ మి అప్' సాంగ్ కూడా లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. నామినేట్ అయిన మిగతా పాటలకు కూడా ఆయా సింగర్స్ లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.

ఈ సాంగ్‌లో జూనియర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్ వేసిన డ్యాన్స్ భారత్‌తో పాటు ప్రపంచదేశాలను ఒక ఊపు ఊపేసింది, అంతే కాకుండా ఇదే స్టేజి మీద రాహుల్ & కాల భైరవ లైవ్ పెర్ఫార్మన్స్ టైంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ డాన్స్ చేస్తే బాగుంటుంది అని అందరు అనుకుంటున్నారు, అలాగే ప్రస్తుతం ట్విట్టర్ లో "నాటు నాటు" ట్రెండింగ్ లో ఉంది.

రామ్ చరణ్ ఇప్పటికే అమెరికాలో ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు ఎన్టీఆర్ వెళ్ళలేదు,13 వరకు అయినా వెళ్తాడు ఏమో చూడాలి మరి.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా మార్చ్ 13 కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూద్దాం,తప్పకుండా ఈ సారి తెలుగు వారికి ఆస్కార్ అవార్డు దక్కాలని కోరుకుందాం.


Source: Twitter - The Academy

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support