లిరిక్స్ (Lyrics): ఆశ పాశం బందీ సేసేలే.. సాగే కాలం ఆడే ఆటేలే.. - C/O కంచరపాలెం


Asha Pasham Lyrics In Telugu

ఆశ పాశం బందీ సేసేలే.. సాగే కాలం ఆడే ఆటేలే.. తీరా.. తీరం.. సేరేలోగానే ఏ తీరౌనో

సేరువైనా సేదూ దూరాలే.. తోడౌతూనే ఈడే వైనాలే.. నీదో.. కాదో.. తేలేలోగానే ఎదేటౌనో

ఆటు.. పోటు.. గుండే మాటుల్లోనా.. సాగేనా

రూ రుతుతుతూ రూ రూ రూ రూ రూ రూ రురూ రూ రురూ

ఏలేలేలేలో.. కల్లోలం ఈ లోకంలో.. లోలో.. లోలోతుల్లో.. ఏవిల్లో ఎద కొలనుల్లో

నిండు పున్నమేల మబ్బు కమ్ముకొచ్చి సిమ్మ సీకటల్లిపోతుంటే.. నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండ తల్లడిల్లి పోతు పల్లటిల్లిపోయి నీవుంటే.. తీరేనా నీ ఆరాటం

ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా.. రేపేటౌనో.. తేలాలంటే.. నీ ఉనికి ఉండాలిగా..

ఓ ఆటు.. పోటు.. గుండే మాటుల్లోనా.. సాగేనా..

ఆశ పాశం.. బందీ సేసేలే.. సాగే కాలం.. ఆడే ఆటేలే.. తీరా.. తీరం.. సేరేలోగానే ఏ తీరౌనో

ఏ జాడలో.. ఏమున్నదో.. క్రీనీడలా విధి.. వేచున్నదో.. ఏ ముడుపులో.. ఏం దాగున్నదో.. నీవుగా.. తీర్చుకో.. నీ శైలిలో..

సిగ్గు ముల్లు గప్పి రంగులీనుతున్న లోకమంటె పెద్ద నాటకమే.. తెలియకనే సాగే కధనం నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే.. కంచికి నీ కధలే దూరం

నీ సేతుల్లో ఉంది.. సేతల్లో సూపించి.. ఎదురేగి సాగాలిగా రేపేటౌనో.. తేలాలంటే.. నువ్వెదురు సూడాలిగా..

ఓ ఆటు.. పోటు.. గుండే మాటుల్లోనా.. ఉంటున్నా..

తేరా నానే.. నానే.. నానేనా తేరా నానే.. నానే.. నానేనా తారా.. తారా.. తారే రారారే.. తా రా రా రా

తేరా నానే.. నానే.. నానేనా తేరా నానే.. నానే.. నానేనా తారా.. తారా.. తారే రారారే.. తా రా రా రా

రచన: విశ్వ/ స్వీకర్ అగస్తి గానం: అనురాగ్ కులకర్ణి చిత్రం: కంచరపాలెం

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support