మాలికాపురం (Malikapuram) - తెలుగు సినిమా రివ్యూ - పూర్తి స్థాయి ఎమోషనల్ భక్తి కథా చిత్రం

ఉన్నిముకుందన్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘మాలికాపురం’. మళయాళంలో డిసెంబర్ 30న విడుదలై బిగ్ హిట్ గా నిలచిన ‘మాలికాపురం’ చిత్రాన్ని తెలుగులో అనువదించారు.


Malikapuram Telugu Review

ఇది పూర్తి స్థాయి భక్తి కథా చిత్రం.

ఇంతకు ముందు కూడా ఇలా భక్తి చిత్రాలు ఎన్నో చూసి ఉన్నాం. పిల్లలతో ఇలాంటి భక్తి ప్రధానమైన సినిమాలు వచ్చి చాలా రోజులు అయింది.

అయ్యప్ప స్వామి ప్రధానంగా ఈ సినిమా నేపధ్యం సాగుతుంది. అయ్యప్ప స్వామి గుడిలోకి 8 సం.ల లోపు ఆడ పిల్లలకు ప్రవేశం ఉంటుంది. వారిని మాలికాపురం అని పిలుస్తారు. ఈ సినిమాలో కూడా ఒక 8 సం.ల లోపు వయసున్న పాప చుట్టూ కథ తిరుగుతుంది అందుకే ఈ సినిమాకి మాలికావురం అనే టైటిల్ పెట్టడం జరిగింది.

ఇక సినిమా విషయానికి వస్తే ఇందులో అయ్యప్ప స్వామి అంటే పరమ భక్తి ఉన్న ఒక పాప శబరిమల ఎలా వెళ్తుంది, వెళ్లే క్రమంలో ఎలాంటి ఇబ్బందులకు గురి అవుతుంది, చివరికి అయ్యప్పను ఎలా దర్శించుకుంటుంది అనే కాన్సెప్ట్ మీద ఈ కథ సాగుతుంది.

షన్నూగా నటించిన దేవనందా, శ్రీపత్ ఆకట్టుకొనే నటన కనబరచారు, ఉన్ని ముకుందన్ తన పాత్రకు తగిన రీతిలో నటించి మెప్పించారు. అలాగే రంజాన్ రాజ్ సంగీతం అలరిస్తుంది. భక్తిగీతాలు ఆకట్టుకుంటాయి.

ప్లస్ పాయింట్స్: కథ జనాలకు కనెక్ట్ చేసే విధానం, భక్తి సినిమా అవ్వడం, చక్కటి సంగీతం, స్క్రీన్ ప్లే, నటీ నటులు.

మైనస్ పాయింట్స్: నాకు అయితే పెద్దగా మైనస్ ఏం కనపడలేదు.

రేటింగ్ : 3.5 / 5

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support