
Kabza Movie Review Telugu
నటీనటులు : ఉపేంద్ర, కిచ్చా సుదీప్, డాక్టర్ శివరాజ్ కుమార్, శ్రియ శరణ్ దర్శకత్వం : ఆర్ చంద్రు సంగీతం : రవి బస్రూర్ నిర్మాత : ఆర్ చంద్రు, అలంకార్ పాండియన్, ఆనంద్ పండిట్ విడుదల తేదీ : 17 మార్చ్, 2023 సినిమా నిడివి : 136 నిమిషాలు.
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు కన్నడ హీరో & డైరెక్టర్ ఉపేంద్ర, కన్నడలో ఆయన నటించి స్వీయ దర్శకత్వం వహించిన పలు చిత్రాలు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. అలాగే ఆయన ఒక విలక్షణ నటుడు, ఒక విధమైన డిఫెరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు తీయడంలో ఆయన దిట్ట. ఇప్పడు కబ్జా అనే సినిమాతో మార్చ్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరో కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఏడు భారతీయ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసారు.
స్టోరీ :
స్వాతంత్ర ఉద్యమ కుటుంబం నుంచి వచ్చిన ఆర్కేశ్వర (ఉపేంద్ర) ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్. తన సోదరుడి మరణం తర్వాత వారిపై పగ తీర్చుకోవడానికి కొంత మంది గుండాలతో చేతులు కలుపుతాడు. అమరాపూర్ లో ఉన్న లోకల్ రౌడీని చంపి ఒక గ్యాంగ్ స్టర్ గా మారుతాడు. మధుమతి (శ్రియ) ఒక రాజకీయ నాయకుడి కూతురు. ఆ తర్వాత ఆర్కేశ్వర మెల్లగా నార్త్ ప్రాంతంలో పేరు మోసిన గ్యాంగ్ స్టర్ గా ఎదుగుతాడు. ఆ తర్వాత కథలోకి భార్గవ బక్షి (కిచ్చ సుదీప్) అనే ఒక పోలీస్ ప్రవేశిస్తాడు. ఇది కేవలం మొదటి భాగం మాత్రమే. ఆ తర్వాత జరగబోయేది ఏంటి? ఆర్కేశ్వర తర్వాత ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
నటి-నటుల & సాంకేతిక వర్గం పని తీరు :
ఉపేంద్రకి తెలుగులో కూడా చాలా మంచి క్రేజ్ ఉంది. దాంతో ఈ సినిమాకి తెలుగులో కూడా చాలా భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా మొత్తం ముందు చూసిన కొన్ని సినిమాలు అన్ని కలిపి తీసినట్టుగా ఉంటుంది. సినిమా కలర్ గ్రేడింగ్ అంతా కూడా కేజీఎఫ్ సినిమాని గుర్తుచేసే లాగా ఉంటుంది. VFX మొత్తం పూర్ క్వాలిటీతో ఉంది. సినిమాలో నటించిన నటీనటులు తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు. హీరోయిన్ శ్రియ ఇలాంటి పాత్ర అంతకుముందు చాలా సినిమాల్లో చేశారు అనిపిస్తుంది. సుదీప్ మరియు రాజ్ కుమార్ పాత్రలు కొన్ని నిముషాలు మాత్రమే ఉంటాయి, ఇందులో సినిమాటోగ్రఫీ బాగా హైలైట్ అయ్యింది. ఇక సంగీత దర్శకుడు రవి బస్రూర్ (కేజీయఫ్ ఫేమ్) ఇచ్చిన స్కోర్ బాగుంది, ఎడిటింగ్ ఇంకొంచెం బాగా చెయ్యాల్సింది.
సినిమా చూస్తున్నంత సేపు ఇలాంటి సీన్ అంతకు ముందు మనం చాలా సినిమాల్లో చూసాం కదా అనిపించే సందర్భాలు చాలా ఉన్నాయి. అది మాత్రమే కాకుండా ఇది కేవలం మొదటి భాగం మాత్రమే. మరి రెండవ భాగం ఎలా ఉంటుంది అనేది తెలియదు. సుదీప్ పాత్ర రెండవ భాగంలో ఒక కీలక పాత్ర అవుతుంది అని హింట్ మాత్రం ప్రేక్షకులకి ఇచ్చారు. కబ్జా సినిమా మొత్తం హీరో ఉపేంద్ర సోలో షో. మ్యూజిక్ పర్వాలేదు. స్టోరీ నెరేషన్ ఏమాత్రం గ్రిప్పింగ్ గా లేదు. సాధారణ గ్యాంగ్ స్టర్ మూవీ. క్లైమాక్స్ లో పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు. డబ్బింగ్ మాత్రం అస్సలు బాగాలేదు అని చెప్పాలి.
ఇక దర్శకుడు ఆర్ చంద్రు విషయానికి వస్తే మొత్తం డిజప్పాయింట్ చేసాడని చెప్పొచ్చు, ఎలేవేషన్ సీన్స్ తో పాటు కొంత స్టోరీ & స్క్రీన్ ప్లే మీద శ్రద్ధ పెట్టాల్సింది.
ఇలాంటి సినిమా తీయడంలో తప్పు లేదు, కాకపోతే ఇది ఒక రకంగా KGF మూవీ ఇంకో వెర్షన్ అనుకోవచ్చు, సినిమా మొదలు అయినప్పటి నుండి మనకి ఆ ఫీల్ వస్తుంది, చూస్తుంటే తెలుగు ఆడియన్స్ కి మాత్రం అస్సలు నచ్చక పోవచ్చు. ఏదో ఊహించుకొని సినిమాకి వెళ్తే మాత్రం ఈ సినిమా నిరాశే మిగులుస్తుంది.