Hit 3 Review Telugu - హిట్ మూవీ రివ్యూ తెలుగులో


Hit 3 Movie Review in Telugu

నటీనటులు: నాని, శ్రీనిధి శెట్టి, సముద్రఖని, రావు రమేష్, కోమలి ప్రసాద్, సూర్య శ్రీనివాస్ తదితరులు. సంగీతం: మిక్కీ జే మేయర్ ఛాయాగ్రహణం: సాను వర్గీస్ నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని రచన-దర్శకత్వం: శైలేష్ కొలను విడుదల తేదీ: 01-05-2025

టాలీవుడ్ లో నాచురల్ స్టార్ గా గుర్తింపు పొందిన నాని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హిట్ త్రీ (ది థర్డ్ కేసు). టైర్ 2 హీరోలలో టాప్ పొజిషన్ లో ఉన్న హీరో నాని. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంతో హిట్ ఫ్రాంచైజీలో ఇప్పటికే హిట్, హిట్ 2 చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు శైలేష్. ఈ హిట్ ఫ్రాంచైజీ లోని మొదటి రెండు సినిమాలలో విశ్వక్ సేన్, అడవి శేషు హీరోలుగా నటిస్తే ఈసారి తన ప్రొడ్యూసర్ నాని ని హీరోగా పెట్టి హిట్-త్రీ ని రూపొందించాడు. హిట్, హిట్ 2 సినిమాలు మంచి హిట్ సాధించటంతో పాటు, హిట్ 3 టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో విడుదలకు ముందే విపరీతమైన అంచనాలను క్రియేట్ చేసింది ఈ సినిమా. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా సఫలమైందో విఫలమయ్యిందో ఈ రివ్యూ లో చూద్దాం.

కథ:

హిట్ 2 క్లైమాక్స్ లో ఎక్కడ కథ ముగుస్తుందో ఆ సీన్ నుండే కథ మొదలు పెట్టాడు దర్శకుడు, అర్జున్ సర్కార్ (నాని) హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం (హిట్)లో ఎస్పీగా పనిచేస్తుంటాడు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, ఇంకా చాలా కోపిష్టి, నేరస్తులతో చాలా కఠినంగా వ్యవహరిస్తుంటాడు. అతను కాశ్మీర్ లో పనిచేస్తున్న సమయంలో తనకు ఎదురైన ఒక విచిత్రమైన కేసుని ఛేదించే సమయంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంతకీ ఆ కేసు ఏంటి? దానిని ఛేదించేందుకు అర్జున్ సర్కార్ ఎక్కడిదాక వెళ్ళాడు? చివరికి అనుకున్నది సాధించడం లేదా? అన్నది ఈ సినిమా కథ.

సినిమా ఎలా ఉంది అంటే:

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జోనర్ లో హిట్ అనే ఫ్రాంచైజీ క్రియేట్ చేసి రెండు సూపర్ హిట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లను అందించాడు దర్శకుడు శైలేష్ కొలను,మొదటినుంచి చివరిదాకా సస్పెన్సుతో ఊహకందని ట్విస్టులతో ఉత్కంఠ రేపుతూ మొదటి రెండు సినిమాలూ ప్రేక్షకులకి మంచి అనుభూతిని పంచాయి. ఇపుడు ఇంకా పెద్ద స్టార్ తోడవడంతో థర్డ్ కేసు మీద అందరి అంచనాలు పెరిగిపోయాయి,కాకపోతే ఇక్కడ హీరోని ఈ జోనర్ లో చూడడం కొత్తగా ఉంది, వయొలెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది, మరియు మొదటి రెండు సినిమాల్లో సస్పెన్స్ ను చాలా బాగా క్యారీ చేశారు ఇక ఈ కథలో దాన్నే మిస్ చేశారు.

ఎవరెలా చేశారు అంటే:

నాని పెర్ఫార్మన్స్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కథ కంటే ఎక్కువగా నాని క్యారెక్టర్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టినట్టున్నాడు దర్శకుడు. ఇంతకుముందెన్నడూ చూడని వెరీ హై లెవెల్ హీరోయిజంతో కనిపిస్తాడు నాని. హిట్ 1, హిట్ 2 లో కనిపించే విలన్ పాత్రలు ఆయా సినిమాలకి ప్రధానమైన బలం. కానీ ఈ సినిమాలో నాని ఈ రెండిటిని డామినేట్ చేసాడనే అభిప్రాయం కలుగుతుంది. స్టార్ హీరో అవటం వలన మొదటి రెండు సినిమాలలో లేని కొన్ని అనవసరమైన ఎలివేషన్లు ఇందులో కనిపిస్తాయి. హీరో క్యారెక్టర్ తో పోల్చితే కథ, క్రైమ్ ఎలిమెంట్, ఇన్వెస్టిగేషన్ అంత ఉత్కంఠభరితంగా అనిపించకపోయినా కథలో ట్విస్టులు మాత్రం ప్రేక్షకులను ఉత్కంఠతో కట్టిపడేస్తాయి.

హీరోయిన్ శ్రీనిధి శెట్టి, ఈమెకి KGF వల్ల తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. హిట్ త్రీ లో మృదుల పాత్రలో ఆకట్టుకుంది. హిట్ సిరీస్ లలో హీరోయిన్లకు ప్రాధాన్యత తక్కువే కానీ ఈ సినిమాలో క్యారెక్టర్ బాగుంది. సముద్రఖని గారి క్యారెక్టర్ అలాగే రావు రమేష్ గారు కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాగానే చేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే మిక్కీ జే మేయర్ చక్కటి సంగీతం అందించారు, పాటల విషయం పక్కన పెడితే ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ బాగానే ఉంది. సెకండ్ ఆఫ్ సీన్స్ ముఖ్యంగా డ్రోన్ షాట్స్ అలాగే కలర్ గ్రేడింగ్ మరియు క్యారెక్టర్ ఎలివేషన్స్ బాగున్నాయి.

డైరెక్టర్ శైలేష్ కొలను, ఈయన డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, నమ్ముకున్న కథని ప్రేక్షకులకి నచ్చేలా బాగా తీస్తారు, కాకపోతే ఈ సినిమా విషయంలో ముఖ్యంగా కథ కంటే హీరో క్యారెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టున్నాడు, అలాగే హీరో క్యారెక్టర్ తో బూతులు మరియు డబల్ మీనింగ్ డైలాగులు ఎక్కువయినట్టు అనిపిస్తుంది, రియాలిటీ కి దూరంగా హాలీవుడ్ కథను తీసినట్టుగా ఉంది ఈ సినిమా.

హిట్ సిరీస్ అంటేనే ఇన్వెస్టిగేషన్ కథలు కానీ ఈసారి కథను వేరేలా తీయడం వల్ల సినిమా మీద ఆసక్తి తగ్గింది, దర్శకుడి టేకింగ్, కంటెంట్ మరియు యాక్షన్ అంతా బాగుంది. చివరగా వచ్చే కేమియో పాత్ర అందరూ ఊహించిందే, HIT 4 ని కన్ఫర్మ్ చేశారు చివర్లో.

చివరగా:

అంచనాలను అందుకోవడంలో దర్శకుడు శైలేష్ చాలావరకు సఫలమయ్యాడనే చెప్పుకోవాలి. న్యాచురల్ స్టార్ నాని ఈసారి వయోలెన్స్ స్టార్ నాని అని చూపించాడు. HIT సిరీస్ లలో ఇంకో హిట్ పడ్డట్టే. మితిమీరిన హింస రక్తపాతం అనేది తప్పితే సినిమా చూడతగ్గదే. హిట్1 > హిట్ 2 > హిట్ 3.

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support