రివ్యూ : లాస్ట్ (2023) మూవీ (Lost Movie Review) | యామీ గౌతమ్ | సస్పెన్స్ - థ్రిల్లర్

నటీనటులు : యామీ గౌతమ్, పంకజ్ కపూర్, రాహుల్ ఖన్నా, నీల్ భూపాలన్, పియా బాజ్‌పేయ్, తుషార్ పాండే, తదితరులు. భాషలు : హిందీ రచన : శ్యామల్ సేన్ గుప్తా, రితీష్ షా దర్శకత్వం : అనిరుధ్ రాయ్ చౌదరీ సినిమాటోగ్రఫి : అవిక్ ముఖోపాధ్యాయ్ మ్యూజిక్ : శంతను మోయిత్రా నిర్మాతలు : జీ స్టూడియోస్, నమా పిక్చర్స్ బ్యానర్ : జీ స్టూడియోస్ Platform : జీ5 (ఓటీటీ రిలీజ్) రిలీజ్ డేట్ : 16 Feb 2023


Lost movie review

పింక్ మూవీ డైరెక్ట్ చేసిన అనిరుద్ రాయ్, ఏడు సంవత్సరాల విరామం తర్వాత మరో థ్రిల్లర్ మూవీ తో మన ముందుకు ఈ Lost మూవీని తీసుకు వచ్చారు, ఇది OTT platform Zee5 లో రిలీజ్ చేసారు.

కథలోకి వస్తే లీడ్ రోల్ లో విధి సహానీ (యామి గౌతమ్) క్రైమ్ రిపోర్టర్ గా యాక్ట్ చేసింది, ఇషాన్ భారతీ (తుషార్ పాండే) అనే థియేటర్ ఆర్టిస్ట్ ఉన్నట్టుండి అదృశ్యమవుతాడు, ఇలా స్టోరీ మొదలవుతుంది.

ఇక్కడ అందరికీ మొదట ఇషాన్ రిలేషన్ లో ఉన్న అంకిత చౌహాన్ (పియా బాజ్‌పేయ్)పై అనుమానం వస్తుంది, అలాగే కుటుంబ సభ్యులు కేసు కూడా నమోదు చేస్తారు. ఆ తర్వాత రాజకీయ నాయకుడు రంజన్ వర్మన్ (రాహుల్ ఖాన్నా) వ్యవహరించే తీరు అనుమానాస్పదంగా మారడం వల్ల విధి సహానీకి రంజన్ వర్మ మీద అనుమానం మొదలవుతుంది.

అసలు ఇషాన్ భారతికి ఏమైంది, ఎలా మిస్ అయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు & విధి సహానీ తన క్రైమ్ రిపోర్టింగ్ ద్వారా కేసుని ఎలా లీడ్ చేస్తుంది అనేదే ఈ సినిమా.

డైరెక్టర్ సమాజం లో జరిగే సున్నితమైన అంశాలను తీసుకొని సినిమా తీసే విధానం మనం పింక్ మూవీ లో చూసాం, ఇందులో కూడా కొన్ని సున్నితమైన అంశాలను,కొందరి అక్రమాలు, అవినితీపై చైతన్యం కలిగించే అంశాలు, మరియు పోలీసు, రాజకీయ వ్యవస్థ ఎలా ప్రభావితం చేస్తాయి అనే వాటి మీద ఈ సినిమా తీశారు.

క్రైమ్ జర్నలిజంలో ఒక విషయంపై రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు రాజకీయ ఒత్తిళ్లు ఎలా ఉంటాయనే విషయాన్నీ చూస్తున్న ప్రేక్షకులకు అర్థం అయ్యేలా వివరించే ప్రయత్నం చేసారు, కానీ కొన్ని సీన్స్ మాత్రం అసంపూర్తిగా ఉండడం కొంత మైనస్.

Anyway its a good thought & much needed script to awake people to know what is happening in the society & aware about the discrimination on some people & politics.

యామీ గౌతమ్ జర్నలిస్టుగా అద్భుతమైన నటనను ప్రదర్శించింది. కీలక సన్నివేశాల్లో ఆమె బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకొనేలా ఉంది. జర్నలిస్టు పాత్రలో మెప్పించే ప్రయత్నం చేసింది. Undoubtedly Yami Gautham did her best performance in this film.

ఇక పియా బాజ్‌పేయ్‌ ఇంతకు ముందు కంటే భిన్నంగా కొత్త పాత్రలో కనిపించింది, అలాగే రాహుల్ ఖన్నా తనదైన శైలిలో విలన్ పాత్రను చక్కగా పోషించాడు. యామీ గౌతమ్ కి తాతగా పంకజ్ కపూర్ తన నటనతో ఆకట్టుకొన్నారు.

శంతను మొయిత్రా అందించిన మ్యూజిక్ బాగుంది, అవిక్ ముఖోపాద్యాయ్ సినిమాటోగ్రఫి కొంత ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కానీ ఎడిటింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ కొంత బాగాలేదు అనిపిస్తుంది, కొన్ని సీన్స్ సాగదీశారు, కొన్ని సీన్స్ అసంపూర్తిగా మిగిలిపోవడం లాంటి వాటి వాళ్ళ కొంత మైనస్ జరిగింది.

ఫైనల్ గా చెప్పాలి అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమా కనుక పర్లేదు చూడొచ్చు, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చూసే వారికి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు చూసే వారికి నచ్చుతుంది.

రేటింగ్ : 3 / 5

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support