
Breathe into the shadows season 2 review
వెబ్ సిరీస్ : బ్రీత్ ఇన్ టూ ది షాడోస్ నటీనటులు : అభిషేక్ బచ్చన్, నిత్యా మీనన్, అమిత్ సద్, నవీన్ కస్తూరియా, సయామీ ఖేర్ దర్శకుడు : మయాంక్ శర్మ నిర్మాతలు : విక్రమ్ మల్హోత్రా మరియు అబదంతియ ఎంటర్టైన్మెంట్ సంగీత దర్శకులు: కరణ్ కులకర్ణి సినిమాటోగ్రఫీ : ఎస్. భరద్వాజ్ ఎడిటర్ : సుమీత్ కోటియన్
బ్రీత్ ఇన్ టూ ది షాడోస్ సీజన్ - 1 కొద్ది రోజుల క్రితం విడుదలయి మంచి విజయం అందుకోగా అభిషేక్ బచ్చన్ ఈ వెబ్ సిరీస్ తో మంచి పేరు సొంతం చేసుకున్నారు. మరి ఇక నవంబర్ 9న రిలీజ్ అయిన బ్రీత్ ఇన్ టూ ది షాడోస్ ఎస్ - 2 ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
అమెజాన్ ప్రైమ్ ఈ మధ్య క్రైమ్ థ్రిల్లర్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు రిలీజ్ చేసి హిట్ కొడుతూనే ఉంది. ఇక్కడ మొదటి సీజన్ ముగింపుగా రెండవ సీజన్ మొదలు అవుతుంది. బ్రీత్ సిరీస్‌లో మాధవన్ ప్రధాన పాత్రలో వచ్చాడు. ఆ తరువాత వచ్చిన వచ్చిన బ్రీత్ ఇన్ టూ ది షాడోస్ సిరీస్‌లో అభిషేక్ బచ్చన్ లీడ్ రోల్ చేశాడు.
బ్రీత్ ఇన్ టూ ది షాడోస్‌కు దర్శకుడు మయాంక్ శర్మ (Mayank sharma) సరైన ముగింపు ఇచ్చాడా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే. అవినాష్ (అభిషేక్ బచ్చన్) ముల్టీపుల్ పర్సనాలిటీ డిసార్డర్ తో బాధపడుతూ ఉంటాడు, మరియు వరుస హత్యలకు పాల్పడుతుండటంతో ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్‌లో చేరుస్తారు. అక్కడే ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న మరో పేషెంట్ విక్టర్ (నవీన్ కస్తూరియా)తో కలిసి హాస్పిటల్ నుంచి తప్పించుకున్న అవినాష్ తన పది హత్యల టార్గెట్‌లో మిగిలిన ఆరు మర్డర్స్‌ను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.
మరోవైపు తన భర్త అవినాష్‌ను జే(J ) అనే వ్యక్తి నుండి అతడిని కాపాడేందుకు అభా (నిత్యామీనన్) ప్రయత్నిస్తుంటుంది. అలాగే అవినాష్‌ను ఆ హత్యలు చేయకుండా అడ్డుకోవడమే కాకుండా అతడిని పట్టుకునేందుకు పోలీస్ ఆఫీసర్ కబీర్ సావంత్ (అమిత్ సదా) ఛార్జ్ తీసుకొని తన ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతాడు.
ఇక్కడి నుండి ఏం జరగబోతుంది, అవినాష్ తాను అనుకున్నట్టు మిగిలిన హత్యలు చేస్తాడా లేదా అన్నదే మిగిలిన కథ.
ఈ కథలో పది తలల రావణుడి కాన్సెప్ట్ చాలా బాగుంది, అలాగే దర్శకుడు ప్రతి మర్డర్ కి ఇచ్చే ట్విస్టు లు చాలా బాగా ఉన్నాయి, ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ కథను నడిపించాలి అంటే ప్రేక్షకుడు ఎక్సపెక్ట్ చేయలేని విధంగా కథను నడిపించాలి. కొన్ని సీన్స్ ఎక్సపెక్ట్ చేసేలా ఉన్నాకూడా ఎక్కడా బోర్ ఫీల్ ఉండదు. రావణ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారో క్లారిటీ మిస్ అయింది, లాజిక్స్ చూస్తే సినిమా ఎంజాయ్ చేయలేము, ప్రతి సిరీస్ లాగానే మొదటి సిరీస్లో ఉన్నంత ఇంటెన్సిటీ రెండవ దాంట్లో ఉండదు, ఇక్కడ కూడా అదే జరిగింది.
సీజన్ 1లో అదరగొట్టే పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న అభిషేక్ బచ్చన్ సీజన్ 2 లో కూడా అద్భుతంగా నటించారు. ఆయన బాడీ లాంగ్వేజ్, స్టైల్, డైలాగ్స్ ఇలా ప్రతి అంశంలో కూడా సూపర్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టారు అభిషేక్ బచ్చన్ గారు. కష్ట సాధ్యమైన క్యారెక్టర్ ని చాలా బాగా హేండిల్ చేసారు. నిత్య మీనన్ క్యారెక్టర్ చాలా బాగా ఉన్నప్పటికీ డైరెక్టర్ కొన్ని లాజిక్స్ మిస్ చేయడం వల్ల ఎక్కడో ఏదో మిస్ ఐన ఫీలింగ్. చెప్పాలంటే సగటు ప్రేక్షకునికి కొంత confuse చేసే క్యారెక్టర్. ఇక పోతే అమిత్ సాద్, నవీన్ కస్తూరియా వారి వారి పాత్రలకు న్యాయం చేసారు.
సంగీత దర్శకుడు కరణ్ కులకర్ణి వర్క్ బాగుంది, క్రైమ్ స్టోరీస్ లో ఎప్పుడు కూడా బాక్గ్రౌండ్ స్కోర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ఇక్కడ అదే చాలా ప్లస్ పాయింట్, నార్మల్ సీన్స్ ని కూడా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే bgm అందించారు.
భరద్వాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది, అలాగే డైరెక్టర్ కన్నా ఎడిటింగ్ వల్ల కొంత ప్లస్ ఐంది అని చెప్పొచ్చు.
ఫైనల్ గా బ్రీత్ ఇన్ టూ ది షాడోస్ సీజన్ 2లో యాక్టింగ్ పెర్ఫార్మన్స్ & ట్విస్టులతో పర్వాలేదు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ ముందే ఎక్సపెక్ట్ చేసేలా ఉండడం కొంత మైనస్ అని చెప్పొచ్చు. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్లకి తప్పకుండ నచ్చే సిరీస్ అని మాత్రం చెప్పొచ్చు.
Rating : 3.5 / 5.0