
The night manager web series review
ది నైట్ మేనేజర్ ( వెబ్ సిరీస్) స్ట్రీమింగ్ వేదిక: హాట్ స్టార్ నటులు: అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, శోభిత ధూళి పాళ, తిలోత్తమ షోమ్, అరిస్టా మెహతా, తదితరులు.
సినిమాటోగ్రఫీ: బెంజిమన్ జాస్పర్ సంగీతం: సామ్ సి ఎస్ దర్శకత్వం: సందీప్ మోదీ నిర్మాణ సంస్థ: ది ఇంక్ ఫ్యాక్టరీ & బనిజె ఏసియా
2016 లో ఇంగ్లీష్ లో వచ్చిన "ది నైట్ మేనేజర్" సిరీస్ ను అదే పేరుతో ప్రముఖ OTT సంస్థ "హాట్ స్టార్" తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠి బాషలలో రీమేక్ చేసి ఈ నెల (ఫిబ్రవరి) 17న రిలీజ్ చేసారు.
స్టోరీ లోకి వస్తే,ఆదిత్య రాయ్ కపూర్ ఇందులో షాన్ సేన్ గుప్త అనే క్యారెక్టర్ లో కనిపిస్తారు, షాన్ సేన్ గుప్త బాంగ్లాదేశ్ లోని ఒక హోటల్ లో నైట్ మేనేజర్ గా చేస్తూ ఉంటాడు, అంతే కాకుండా తనకి వీలు అయినంత వరకు అందరికి సహాయం చేస్తూ ఉంటాడు, ఆలా ఒక రోజు సఫీనా(అరిస్టా మెహతా) షాన్ సేన్ దగ్గరికి సహాయం చేయాలనీ అడుగుతుంది, విషయం ఏంటి అంటే తన భర్త రెహమాన్ (రేష్ లంబ) బిజినెస్ ముసుగులో తప్పుడు పనులు చేస్తున్నాడని, ఒక గ్యాంగ్స్టర్ అని చెబుతుంది. అలాగే తనని ఇండియా పంపమని షాన్ ని కోరుతుంది, కానీ బంగ్లా లో ఉన్న కొన్ని పరిస్థితుల వల్ల ఇప్పుడు పంపడం కుదరదు అని చెబుతాడు. అలాగే రెహమాన్ గ్యాంగ్స్టర్ అని తెలియజేసే ఒక వీడియో మన ఇండియాలోని RAW చేతికి దొరుకుతుంది, అది సఫీనానే లీక్ చేసింది అనే అనుమానం తో సఫీనా ని హత్య చేస్తారు.
ఇక్కడే శైలేంద్ర రుంగతా( అనిల్ కపూర్) ఎంట్రీ ఉంటుంది, శైలేంద్ర నిజానికి రెహమాన్ తో ఆయుధాల సరఫరా డీల్ కుదుర్చుకుంటాడు. ఇదే విషయం మీద తమ రహస్యాలు బయట పెట్టిందనే కారణంగా సఫీనాని శైలేంద్ర హత్య చేసాడని షాన్ కి అనుమానం వస్తుంది. అసలు వీళ్ళు అంతా వ్యాపారవేత్త ల ముసుగులో ఇలా చీకటి వ్యాపారాలు ఎందుకు చేస్తున్నారు? దీనికి షాన్ కి ఏమైనా సంబంధం ఉందా, నేవి అధికారిగా పని చేసిన షాన్ ఇలా హోటల్ నైట్ మేనేజర్ గా ఎందుకు చేస్తున్నాడు అనేది ఇక్కడ స్టోరీ. ఇది అంతా చూడాలంటే తప్పక ఈ సిరీస్ చూడాల్సిందే.
సిరీస్ మొదటి నుండి ఆధ్యంతం ఇంటరెస్టింగ్ గా సాగుతుంది, ఆదిత్య రాయ్ కపూర్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తాడు, అలాగే ఆదిత్య రాయ్ కపూర్ మరియు అనిల్ కపూర్ మధ్య సన్నివేశాలు చాలా ఇంటరెస్టింగ్ గా సాగుతాయి, సఫీనా కి సహాయం చేయడంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, షాన్ శైలేంద్ర కుటుంబంతో కలిసి పోయినట్టు నటించి వాళ్ళ రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, ఇక్కడ అనిల్ కపూర్ విలన్ క్యారెక్టర్ అంతా గొప్పగా లేదు అనిపిస్తాయి. హీరో మరియు విలన్ మధ్య సన్నివేశాలు చాలా సాదా సీదాగా కనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే విలనిజం కనపడలేదు. ఇందులో RAW ఏజెంట్ గా చేసిన లిపికా క్యారెక్టర్ బాగానే ఉందని చెప్పొచ్చు, హీరో కి సహాయం చేస్తూ ఉండే క్యారెక్టర్ కూడా కొంచెం ఇంటెరెస్టింగానే ఉంది. అనుకున్నట్టుగానే శోభిత కేవలం అందాల ఆరబోయడానికి నటించింది.
మొత్తానికి 4 ఎపిసోడ్ల ఈ సిరీస్ పర్వాలేదు అనిపిస్తుంది, చివర్లో ఇంకో season ఉన్నట్టు హింట్ కూడా ఇచ్చారు, చూడాలి అందులో ఏమైనా ట్విస్ట్ లు ఉంటాయేమో.
ప్లస్ పాయింట్స్: - ఆదిత్య రాయ్ కపూర్ నటన - శోభిత ధూళిపాళ్ల గ్లామర్ - బాక్గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్: - అనిల్ కపూర్ విలనిజం - ఇంటరెస్టింగ్ సీన్స్ లేకపోవడం - తెలిసిన స్టోరీ (వీక్ స్టోరీ)
Verdict: పర్లేదు ఒకసారి చూడతగ్గ సిరీస్. ఇంకొన్ని ఎపిసోడ్స్ ఉంటే ఇంకా బాగుండేది.
రేటింగ్: 2.5 / 5.0