Review: పుష్ప 2 - The Rule

నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, జగదీష్ భండారీ, తదితరులు.. కథ, కథనం, దర్శకత్వం: సుకుమార్ నిర్మాత: నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ సినిమాటోగ్రఫి: మిరోస్లోవ్ క్యుబా బ్రోజెక్ సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ ఎడిటింగ్: నవీన్ నూలి బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ రిలీజ్ డేట్: 05-12-2024


Pushpa 2 - Review

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో అందరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అవ్వడం జరిగింది, అలాగే ప్రీమియర్ షోస్ తో ఒకరోజు ముందు నుండే ప్రేక్షకులను డబ్బులతో దోచుకోవడం కూడా జరిగింది.

మొదటి పార్ట్ భారీ విజయం సాధించడం వల్ల ఇండియా మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేలా చేసి మళ్ళీ పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో ఈ సినిమా విడుదల అయింది, అలాగే తన మార్క్ డైలాగ్ కూడా ఈ సారి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ - పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ ప్రేక్షకులను థియేటర్ కి రావాలి అనిపించేలా చేసాయి.

కథ:

మొదటి భాగం అందరికి తెలిసిందే ఒక కూలి పని చేసే వ్యక్తి పుష్పరాజ్ (అల్లు అర్జున్) ఎర్ర చందనం స్మగ్లర్ గా మారి సిండికేట్ నడుపుతూ ఒక నాయకుడిగా ఎలా ఎదిగాడో చూసాం, అలాగే తన సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో SP భన్వర్ సింగ్ షెకావత్ (ఫాహద్ ఫాజిల్) అడ్డు తగులుతాడు. అక్కడితో మొదటి భాగం పూర్తయింది. ఇక ఈ సెకండ్ పార్ట్ పుష్ప-2 కథ నడిచేది పుష్ప తన భార్య శ్రీవల్లి (రష్మిక)కి ఇచ్చిన మాట కోసం ఎంత దూరం వెళ్లాడు, సీఎంను మార్చి రూలింగ్ రాజకీయాలను ఎలా శాసించాడు? తన ఇంటిపేరును దక్కించుకోవడం కోసం పడిన తపన ఏంటనేదే పుష్ప ది రూల్ కథ. ఇక మిగిలింది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

పుష్ప 2 - ఎలా ఉంది?

పుష్ప మొదటి భాగంలో ప్రతి క్యారెక్టర్ కి ఇంట్రడక్షన్ ఇచ్చేస్తూ హీరోకి మాత్రం గట్టి ఎలివేషన్ ఇచ్చేసి ఒక బ్రాండ్ గా తయారు చేసాడు డైరెక్టర్ సుకుమార్, ఈ పార్ట్ లో ఫస్ట్ హాఫ్ చాలా వీక్ మరియు సాగదీసాడు అని చెప్పొచ్చు, నేషనల్ నుండి ఇంటర్నేషనల్ ఎదుగుదాం అని అనుకున్న హీరో క్యారెక్టర్ కి ఎలివేషన్స్ ఇస్తూ పాత క్యారెక్టర్స్ ని నడిపిస్తూ స్లో గా నడిపించాడు, తన మార్క్ మాస్ చూపిస్తూ జాతర మాత్రం చేసాడు హీరో క్యారెక్టర్ లో అల్లు అర్జున్.

ఇక పోతే ఒక స్మగ్లర్ గా మొదలైన జీవితాన్ని ఒక సీఎం ని మార్చే లెవెల్ కి తీసుకెళ్లి పోయాడు సుకుమార్ తన కథలో.. భార్య చెప్పిన మాట వింటూ తన కోరిక కోసం (ఫోటో) ఒక సీఎంని మార్చేసేలా రాసాడు సుకుమార్.. మొదటి భాగంలో షెకావత్ తో జరిగిన సన్నివేశాల తర్వాత అందరు ఈ భాగం అంతా పుష్ప మరియు షెకావత్ మధ్యనే ఉంటుంది అనుకుంటారు, అనుకున్నంత కాకపోయినా కొంత వరకు బాగానే ఉంటుంది, పుష్ప తన మనుషుల్ని స్టేషన్ నుండి విడిపించే సీన్స్, అలాగే వాళ్ళ ఇద్దరి మధ్య ఎత్తుకు పై ఎత్తులు ఇలా, కానీ చాలా సన్నివేశాలు ఎదో సినిమాటిక్ గా, రియాలిటీ కి చాలా దూరంగా అనిపిస్తాయి. మొదటి భాగంలో ఫామిలీ డ్రామా లేకపోయినా ఈ భాగం లో తన భార్య చుట్టూనే కథ తిరుగుంది, ట్రైలర్ లో చూపించినట్టుగానే పెళ్ళాం మాట వినే భర్తగానే నడుస్తుంది కథ.

మొదటి ఫైట్ అంత ఆకట్టుకోదు, ఫస్ట్ హాఫ్ అంతా స్లో గా సాగుతుంది, ప్రీ ఇంటర్వెల్ సీన్స్ నుండి ఒక్కసారిగా కథ మారిపోతుంది. ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి, ఫస్ట్ హాఫ్ అంతా అల్లు అర్జున్ మాత్రమే నడిపిస్తాడు, జనాలకి మాస్ జాతర చూపిస్తాడు తన మార్క్ యాక్టింగ్ తో, ఇక పోతే కొన్ని వెగటు పుట్టే సీన్స్ మాత్రం ఉన్నాయి.

ఇక సెకండ్ పార్ట్ లో మొదలు అవుతుంది అసలైన జాతర, అదే ట్రైలర్ లో చూసి అందరూ ఎదురు చూసే గంగమ్మ తల్లి జాతర సీన్, ఈ ఒక్క సీన్ తో అల్లు అర్జున్ & సుకుమార్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి పోయారు, హీరో చీర కట్టుకుని నడిచే సీన్ తో ఫాన్స్ కి మాత్రం పూనకాలే.. ఇక ఆ తరవాత మళ్ళీ కథ సాగదీత మాత్రమే.. ఒక్కటి చెప్పాలి అంటే సుకుమార్ ఒక 7 - 8 సీన్స్ మాత్రమే రాసుకొని ఈ పార్ట్ నడిపించి మిగిలిన కథ తో ఇంకో పార్ట్ ప్లాన్ చేసాడు అని క్లియర్ గా అర్థం అవుతుంది.

నటి నటులు - సాంకేతిక నిపుణుల పని తీరు:

చెప్పక్కర్లేదు అల్లు అర్జున్ పుష్ప క్యారెక్టర్లో ఒదిగి పోయాడు, నమ్ముకున్న కథకి తన వంతు న్యాయం చేసాడు, తన మ్యానరిజంతో ఆకట్టున్నాడు, ఆ యాసని ఒంటపట్టించుకున్నాడు, జాతర సీన్ మాత్రం అంచనాలకి తగ్గట్టుగానే విశ్వరూపం చూపించాడు, కాకపోతే రష్మిక తో కొన్ని సీన్స్ మాత్రం వెగటుగా అనిపిస్తాయి, మొదటి భాగంలో కూడా ఈ విషయంలో కొన్ని విమర్శలున్నాయి. ఇది ఈ రెండవ భాగం లో కూడా కొంత మైనస్..

ఇక రష్మిక మొదటి పార్ట్ లాగానే పెద్దగా తేడా ఏం లేదు, ఇంకా కొంత ఎక్కువగానే గ్లామర్ డోస్ పెంచింది క్యారెక్టర్ కి, కొంత యాక్టింగ్ కూడా స్కోప్ ఉన్న క్యారెక్టర్. "కిస్సిక్ " పాటతో శ్రీ లీల మెరిసింది. తన డాన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మొదటి భాగం లో ఉన్న పాటని మరియు సమంత ని బీట్ చేయ లేక పోయింది ఈ పాట అలాగే శ్రీ లీల కూడా..

ఇక పోతే ఫహద్ ఫాసిల్, అసలు ఈ పార్ట్ అంతా ఈ క్యారెక్టర్ తో అని జనాలు ఫిక్స్ అయి ఉన్నారు, ఆయన నటన మీద ఎక్సపెక్టషన్స్ కూడా ఉన్నాయి, కానీ అంచనాలకు తగ్గట్టుగా వాడలేదు అనిపించింది, ఉన్నంత వరకు హీరో మరియు షెకావత్ సీన్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయి.

రావు రమేష్ పాత్ర కొంత కీలకం ఉన్నంతలో ఓకే, అనసూయ మరియు సునీల్ పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఈ పార్ట్ లో జగపతి బాబు క్యారెక్టర్ ఉంది అలాగే కేశవ పాత్ర ని తగ్గించి పెట్టారు.

ముందుగా చెప్పినట్టుగానే సుకుమార్ మూడవ భాగం కోసం సాగదీసి క్లైమాక్స్ లేకుండా ఇంకో పార్ట్ కోసం తీసినట్టుగానే ఉంది, తన వరకు ఎంత వరకు చేయాలో చేసాడు, కానీ జనాలు ఎలా తీసుకుంటారు అనేది ప్రశ్న. కేవలం ఎంటర్టైన్మెంట్ కావాలి మాకు కథ తో సంబంధం లేదు అనుకుంటే మాత్రం పర్లేదు పుష్ప-2 సేఫ్.

ఇక దేవి శ్రీ ప్రసాద్ అయితే ఇరగదీసాడు అనే చెప్పొచ్చు. బాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది. ఎడిటింగ్ మరియు స్క్రీన్ ప్లే లో ఇంకా కొంచెం బాగా తీసి ఉండొచ్చనిపిస్తుంది, సినిమా లెంగ్త్ పెంచడం కూడా కొంత మైనస్, అనవసరమైన సన్నివేశాలు కొన్ని తగ్గిస్తే బాగుండేది.

చివరగా చెప్పొచ్చేదేంటంటే.. పుష్ప 2 ఓకే, అంత గొప్పగా లేదు, అంత చప్పగా కూడా లేదు.

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support