రివ్యూ: గ్రంథాలయం తెలుగు మూవీ


Grandhalayam movie review

నటీనటులు : విన్నుమద్దిపాటి, స్మిరిత రాణి బోర, కాలకేయ ప్రభాకర్‌, సోనియాచౌదరి, అలోక్‌జైన్‌, జ్యోతి రానా, భద్రం మేక రామకృష్ణ, తదితరులు సినిమాటోగ్రఫీ : సామలభాస్కర్‌ సంగీతం : వర్ధన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ : చిన్నా రచన - దర్శకత్వం : శివన్‌ జంపాన బ్యానర్ : వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌ ఎడిటర్ : శేఖర్ పసుపులేటి విడుదల తేదీ : మార్చ్ 3, 2023

కథ :

ఒక ఊరిలోని గ్రంథాలయంలో విచిత్రమైన పరిస్థితి గ్రామస్థులను వెంటాడుతుంటుంది. 1965 సంవత్సరంలో ప్రచురించిన ఓ పుస్తకాన్ని చదివిన 100 మంది వరకు చనిపోయి ఉంటారు. దాంతో ఆ పుస్తకం గురించి అందరూ మాట్లాడుకుంటూ, భయపడుతూ ఉంటారు. అయితే అనుకోకుండా ఒక రోజు హీరోయిన్ ఇందుమతి (స్మిత రాణి) ఆ బుక్ చదవడం మొదలు పెడుతుంది. అయితే హీరోయిన్ తో ప్రేమలో ఉన్న హీరో రాజా హరిశ్చంద్ర కృష్ణ ప్రసాద్ (విన్ను మద్దిపాటి)కు ఆ బుక్ చదివితే 3 రోజుల్లో చనిపోతారు అన్న విషయం తెలిసి హీరోయిన్ ని చదవడం ఆపమని చెప్తాడు. కానీ హీరోయిన్ బుక్ చదవడం ఆపదు, అయితే హీరో ఆ బుక్ అక్కడికి ఎలా వచ్చింది, ఎవరు దాన్ని ఇక్కడ పెట్టారు, ఎందుకు చదివిన వాళ్ళు చనిపోతున్నారు అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.

ఆ తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఇక్కడ సినిమా నాలెడ్జి కనీసం ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక హాలీవుడ్ మూవీ స్టోరీ అని అర్థం అవుతుంది. కాకపోతే దర్శకుడు తనకి తగ్గట్టు మార్పులు చేసుకొని సినిమా తీసాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే అందరూ కొత్త వాళ్ళు అవడం వల్ల కొంత రీచ్ తగ్గుతుంది. కానీ కంటెంట్ నచ్చితే సినిమా హిట్ చేయడానికి ప్రేక్షకులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు కూడా.

నటి - నటుల పని తీరు:

అందరూ కొత్త వాళ్ళే, ఒక్క కాలకేయ ప్రభాకర్ తప్ప, అయినా కూడా దర్శకుడు తనకి తగ్గట్టు సినిమాని నిర్మించగలిగాడు. రాజా హరిశ్చంద్ర పాత్రలో విన్ను మద్దిపాటి చాలా బాగా నటించాడు, ఇందుమతిగా స్మితరాణి గ్లామర్ పరంగా, నటనపరంగా కూడా ఆకట్టుకొన్నది. కాలకేయ ప్రభాకర్ తన మార్కు నటనను విలన్ గా చూపించాడు. సోనియా చౌదరి, డాక్టర్ భద్రంతోపాటు మిగితా పాత్రల్లో నటించిన వారు వారి వారి పాత్రల పరిధి మేరకు పర్లేదు అనిపించారు.

సాంకేతిక వర్గం పని తీరు :

ఈ మధ్య ప్రేక్షకులు కంటెంట్ కొత్తగా ఉంటే తప్పకుండా ఆదరిస్తున్నారు. ఇక్కడ కూడా అదే ఫార్ములా తో వచ్చాడు దర్శకుడు సాయి శివన్, ఒక సింపుల్ కథని లవ్ యాక్షన్ థ్రిల్లర్ గా తీసాడు. స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ విష్ణు మంచి మ్యూజిక్ అందించాడు, చిన్నా ఇచ్చిన బాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. శేఖర్ పసుపులేటి ఎడిటింగ్ పని తీరు బాగుంది, అలాగే సస్పెన్స్ కి తోడు సినిమాటోగ్రఫీ బాగుంటే సినిమాకి ప్లస్ అవుతుంది, ఇక్కడ సామల భాస్కర్ సినిమాటోగ్రఫీ ప్లస్.

OTT కంటెంట్ చూసే వాళ్లకి సినిమా నచ్చే అవకాశం ఉంది, ఎంకరేజ్ చేయొచ్చు.

Rating : 2.5 / 5.0

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support