
Sir (Dhanush) Movie Telugu Review
ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ 'సార్'. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించడం జరిగింది.
ఇక సినిమా విషయానికి వస్తే బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అయితే అక్కడి పరిస్థితులు అతన్ని ఎలా మారుస్తాయి, మరియు అతని వల్ల ఆ గ్రామం మరియు పిల్లలు ఎలా మారుతారు అనే కాన్సెప్ట్ మీద తీసిన సినిమా ఇది.
ఇంత వరకు బాగానే ఉంది కానీ ఇలాంటి కథ తో ఎన్నో సినిమాలు చూసి ఉన్నాం ఇప్పటికే. అయినప్పటికీ ఈ సినిమా కొత్తగా అనిపిస్తుంది.
ప్రతి మనిషి జీవితంలో చదువు అనేది ఎంత ముఖ్యమో మరియు చదువు వల్ల మనిషి విలువ, ఆర్థిక పరిస్థితి, హోదా ఎలా పెరుగుతాయో ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేసారు సినిమా దర్శకులు.
చదువు అనేది వ్యాపారంగా మారుతున్న నేటి పరిస్థితుల్లో కొన్ని విషయాలను జనాల్లోకి తీసుకెళ్లగలిగాడు డైరెక్టర్. ఒక వర్గానికి నిజానికి చెంప పెట్టు లాంటిదే. స్టూడెంట్స్ మీద కలిగే ఒత్తిడి, మరియు కొన్ని వర్గాల పిల్లల ప్రవర్తన, సమాజం వారిని చూసే విధానం ఇలా ఎన్నో అంశాలు ఇందులో చూడొచ్చు.
Verdict : నటన పరంగా ధనుష్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ స్లోగా స్టోరీని తీసుకెళ్తూ, సెకండ్ హాఫ్ లో ఆలా ఆలా ఎమోషనల్ గా టచ్ చేస్తూ స్టోరీని నడిపించారు.
సాయి కుమార్, సుమంత్, హైపర్ ఆది వారి వారి పాత్రలలో చక్కగా నటించారు.
హీరోయిన్ సంయుక్త మీనన్ , డైరెక్టర్ వెంకీ అట్లూరి, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ సంగీతం, నేపధ్య సంగీతం బాగున్నాయి. యువరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది.
ప్లస్ పాయింట్స్: - ఖచ్చితంగా ధనుష్ - కథ పాతదే అయినా కొంత కొత్తదనం - ఎమోషనల్ సీన్స్ - డైలాగ్స్ - సినిమాటోగ్రఫీ - బాక్గ్రౌండ్ మ్యూజిక్ - దర్శకత్వం
మైనస్ పాయింట్స్: - స్క్రీన్ ప్లే
ఫైనల్ గా 'సర్' సినిమా "ఎమోషనల్ మెసేజ్ ఓరియెంటెడ్. Watchable movie.
Rating : 3.5 / 5