
Shaitan Web Series (Hot Star) Review
నటినటులు: రిషి, షెల్లీ, రవి కాలే, దేవయాని శర్మ, జాఫర్ సాదిక్, కామాక్షి భాస్కర్ల, నితిన్ ప్రసన్న తదితరులు. సంగీతం: శ్రీరామ్ మద్దూరి సినిమాటోగ్రఫీ: షణ్ముగ సుందరం దర్శకత్వం: మహి వి రాఘవ్ నిర్మాత: మహి వి రాఘవ్, చిన్నా వాసుదేవ్ రెడ్డి. విడుదల తేదీ: జూన్ 15, 2023 ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఎపిసోడ్స్ : 9
ఈ మధ్య కాలంలో అడల్ట్ మరియు బోల్డ్ సన్నివేశాలు ఉన్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లకి ప్రాధాన్యత పెరుగుతున్నట్టు అనిపిస్తుంది, ఈ కోవలోకి వచ్చి ఈ మధ్య హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న వెబ్ సిరీస్ సైతాన్.
'ఆనందో బ్రహ్మ', 'యాత్ర' చిత్రాలు తీసిన మహి వి. రాఘవ్ దీనికి దర్శకుడు కావడంతో 'ఆయన ఇలా తీశారేంటి?' అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
క్రియేటర్ & నిర్మాతగా క్లీన్ కామెడీ హిట్ వెబ్ సిరీస్ 'సేవ్ ద టైగర్స్' తర్వాత ఆయన నుంచి 'సైతాన్' రావడం ఆశ్చర్యంగా ఉంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికలో విడుదలైన ఈ వెబ్ సిరీస్ (Shaitan Web Series Review) ఎలా ఉంది అంటే..
ఈ సినిమా ట్రైలర్ చూసిన వాళ్లందరికీ ఇప్పటికే అర్థం అయ్యే ఉంటుంది, ఇది కొంత బూతులు మరియు బోల్డ్ సన్నివేశాలు ఉన్న సినిమా అని. మొత్తం తొమ్మిది ఎపిసోడ్స్‌తో మహి.వి రాఘవ్ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.
కథ:
సావిత్రికి (షెల్లీ నబు కుమార్) బాలి (రిషి), జయప్రద (దేవయాని శర్మ), గుమ్తి (జాఫర్ సాదిక్) అనే ముగ్గురు పిల్లలు ఉంటారు. భర్త వదిలేసి వెళ్లిపోవడంతో పిల్లల కోసం ఓ పోలీస్ తో ఇల్లీగల్ రిలేషన్ లో ఉంటుంది. అయితే తన తల్లి గురించి ఇరుగు పొరుగు వారు తప్పుగా మాట్లాడుతుంటే బాలికి అవమానంగా అనిపిస్తుంది, తల్లి కోసం వచ్చే పోలీస్ తన చెల్లిని కూడా తప్పుడు ఉద్దేశంతో చూడడంతో బాలి ఆ పోలీస్ ని నరికి చంపుతాడు. దీనితో బాలి జైలుకు పోతాడు, ఆ తర్వాత డబ్బు కోసం ఎలాంటి నేరానికైనా సిద్ధపడే బాలి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే దళంలో చేరుతాడు, ఆ తర్వాత ఎంత మందిని చంపాడు, హోమ్ మినిస్టర్ తలకి గన్ పెట్టె స్థాయికి ఎలా ఎదిగాడు అనేది ఈ వెబ్ సిరీస్ కథాంశం.
కథ విశ్లేషణ :
ఈ సమాజంలో ఎవరు నేరస్థులు కారు, పరిస్థితుల ప్రభావం వళ్ళ మాత్రమే నేరస్థులు అవుతారు, చాలా వరకు నేరస్థులు బాధితులే అనే విషయాన్నీ ఈ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు చెప్పాలనుకున్నాడు దర్శకుడు. సైతాన్ కథ నిజంగా సైతాన్ లానే ఉంటుంది. హింస, శృంగారం, బూతులు మాత్రమే కాదు అంతకు మించి ఉంటుంది. హత్యలు చేస్తుంటే అలా చేయడంలో తప్పు లేదు అనేంతగా ప్రేక్షకులను కన్విన్స్ చేసేలా సిరీస్ ని తెరకెక్కించారు దర్శకుడు మహి వి రాఘవ్, సహజత్వానికి దగ్గరగా తీయడం వల్ల తప్పుగా అనిపించదు సగటు ప్రేక్షకుడికి.
అన్ని వర్గాల వారికి ఈ సిరీస్ నచ్చకపోవచ్చు. కాకపోతే హార్డ్ రియాలిటీని తెరకెక్కించాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి స్టెప్ వేయడం తప్పు కాదు అనేది ఒక భావన. బోల్డ్ సీన్లు, ఘాటు సన్నివేశాలే కాకుండా ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. భర్త చనిపోయిన మహిళ వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే ఆమెను ప్రాస్టిట్యూట్ అని ముద్ర వేసే సమాజం మగాడి మీద ఎందుకు వేయదు అని అడిగే ప్రశ్న ఆకట్టుకుంటుంది. నిజ జీవితంలో కొన్ని వర్కవుట్ అవ్వక పోవచ్చు కానీ సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కునే వాళ్ళు ఎందరో!
మొదటి ఎపిసోడ్ నుంచి 'సైతాన్' ప్రపంచంలోకి మహి వి. రాఘవ్ తీసుకు వెళ్లారు. కొన్ని సంఘటనలు మరియు సీన్స్ లాజికల్ గా వర్క్ అవుట్ అవ్వవు కానీ కొంత వరకు నమ్మొచ్చు, సింపుల్ గా చెప్పాలి అంటే ఇది కొంత వర్గాన్ని టార్గెట్ చేసిన సినిమా మాత్రమే, ఫామిలీ తో కలిసి చూసే సినిమా అయితే అసలే కాదు.
నటి నటులు-సాంకేతిక వర్గం పని తీరు:
బాలి పాత్రలో రిషి ఒదిగిపోయారు. కోపం, దుఃఖం, ఆవేశాన్ని చక్కగా పండించారు, అలాగే దేవయాని జయప్రద పాత్రలో జీవించారు, డీ గ్లామర్ లుక్ లో కొంత వరకు బోల్డ్ గా నటించింది. జాఫర్, కామాక్షీ భాస్కర్ల, షెల్లీ, రవి కాలే లు తమ తమ పాత్రలకి చక్కటి న్యాయం చేసారు. ఈ పాత్రలకి వేరే వాళ్ళని ఊహించుకోలేని అంతగా దర్శకుడు వీళ్ళతో నటించేలా చేసాడు.
షణ్ముగ సుందరం కెమెరా పనితనం చాలా బాగుంది. శ్రీరామ్ మద్దూరి మ్యూజిక్ బాగుంది. ఇక పోతే దర్శకుడు మహి వి రాఘవ్ సేవ్ టైగెర్స్ తర్వాత ఇలాంటి సిరీస్ తీస్తాడు అని ఎవరు ఊహించి ఉండరు, సైతాన్ సిరీస్ లో ప్రధాన పాత్రధారలు మాట్లాడే ప్రతి డైలాగ్‌లో ఓ బూతు వినిపిస్తుంటుంది. ఎరోటిక్ సీన్స్ విషయంలో మహి. వి. రాఘవ్ బోల్డ్‌గా చూపించాడు. బాలి రివేంజ్ తీర్చుకునే సన్నివేశాల్లో హింస, రక్తపాతం డోస్ కాస్త ఎక్కువే ఉంది.
చివరగా చెప్పేది ఏంటంటే :
ఇంతకు ముందు ఇంతకంటే ఎక్కువ బూతు కంటెంట్ ఉన్న సిరీస్ లు వచ్చాయి. దీనిని దేనితోనూ కంపేర్ చేయలేం. తెలుగులో ఇప్పటి వరకు ఈ తరహా సిరీస్ రాలేదు. 'సైతాన్' టీజర్, ట్రైలర్ చూసి సిరీస్ స్టార్ట్ చేసిన జనాలను డిజప్పాయింట్ చేయదు.ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది.
This is only for 18+ (adults).