రావణాసుర తెలుగు మూవీ రివ్యూ | Ravanasura Movie Review


Ravanasura Movie Review

సినిమా: రావణాసుర నటీనటులు : రవితేజ, సుశాంత్, జయరామ్, శ్రీరామ్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, తదితరులు. కథ-మాటలు : శ్రీకాంత్ విస్సా సినిమాటోగ్రఫీ : విజయ్ కార్తీక్ కణ్ణన్ ఎడిటింగ్ : నవీన్ నూలి సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో దర్శకత్వం : సుధీర్ వర్మ నిర్మాత : అభిషేక్ నామా, రవితేజ విడుదల తేదీ :ఏప్రిల్ 7, 2023

ర‌వితేజ హీరోగా సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రావణాసుర’, ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చ‌ర్స్, ఆర్‌టీ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా రూపొందించారు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో మంచి ఊపు మీద ఉన్న రవితేజ హీరోగా హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఐదుగురు హీరోయిన్లు మరియు టీజర్, ట్రైలర్ లతో మరియు నెగిటివ్ టైటిల్ తో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయి మంచి టాక్ ని సంపాదిస్తుంది. ఇక కథలోకి వెళ్తే..

కథ :

రవితేజ (రవీంద్ర), ఫారియా అబ్దుల్లా (కనక మహాలక్ష్మి) అనే క్రిమినల్ లాయర్ దగ్గర జూనియర్ లాయర్ గా పనిచేస్తూ ఉంటాడు, మరో హీరోయిన్ మేఘా ఆకాష్ (హారిక) తన తండ్రి సంపత్ రాజ్ మీద పడిన మర్డర్ కేసు అసలు నిజం తెలుసుకొని తన తండ్రిని విడిపించేందుకు రవితేజ మరియు కనక మహాలక్ష్మిని కలుస్తుంది, కానీ కనక మహాలక్ష్మి అందుకు ఒప్పుకోదు, హారికని ఇష్టపడ్డ రవీంద్ర కనక మహాలక్ష్మిని ఒప్పిస్తానని మాట ఇస్తాడు, ఆ తర్వాత కొన్ని మర్డర్స్ జరుగుతూనే ఉంటాయి, అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి, హత్యలు చేస్తున్నది ఎవరు, అందులో రవితేజ పాత్ర ఏంటి అనేది ఈ సినిమా కథ.

కథ విశ్లేషణ :

రవితేజ ఇందులో క్రిమినల్ లాయర్ గా కనిపించారు, టైటిల్ నెగటివ్ గా ఉండడం వల్ల కొంత హైప్ పెరిగింది, ఈ మధ్య చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల వెంట పడుతున్నారు, నిజానికి ఈ జోనర్ సినిమాలకి బడ్జెట్ తక్కువగా ఉంటుంది, కాకపోతే ఇక్కడ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందించారు, హత్య జరగడం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడంతో మొదలయ్యే కథ ప్రేక్షకులకి ఆసక్తిని పెంచుతుంది, ఎంటర్టైన్మెంట్ తో కూడిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇది. సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ లో పాటలు, కామెడీ ఉండవు కానీ రవితేజ హీరో కనుక ఆయన కామెడీ టైమింగ్ కోసం ఫాన్స్ కి కొంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు దర్శకుడు. కామన్ ఆడియన్ ఈజీగా ఊహించే సీన్స్ మాత్రం చాలానే ఉన్నాయి ఈ సినిమాలో, రవితేజ నెగటివ్ షేడ్స్ లో అదరగొట్టాడు అనే చెప్పాలి. ఆయనని చూస్తే ఈ సినిమాలో ప్రతీ ఒక్కరికి ఒక కొత్త అనుభూతి కలుగుతుంది.

నటీనటులు & సాంకేతిక వర్గం పనితీరు :

రవితేజ ఎనర్జీ గురించి చెప్పక్కర్లేదు ఆయన యాక్టింగ్ కానీ, డాన్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ అద్భుతం. ఇందులో రెండు రకాల పాత్రలు చూపించాడు, ఇక హీరోయిన్స్ గా నటించిన ఫారియా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్ మరియు పూజిత పొన్నాడ తమ పరిధిమేర బాగానే నటించారు, ఫారియా మరియు మేఘ ఆకాష్ మెయిన్ లీడ్ అనొచ్చు, జాను పాత్రలో దక్ష నటించింది. సుశాంత్ ఇందులో సాకేత్ అనే ఒక కీలక పాత్రలో నటించాడు చాలా కాలం తర్వాత ఒక మంచి పాత్ర దక్కింది అనే చెప్పాలి, రావు రమేష్, మురళి శర్మ చిన్న పాత్రల్లో నటించారు, అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ క్యారెక్టర్ లో జయరాం గారు నటించారు.

హర్ష వర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, అలాగే శ్రీకాంత్ విస్సా రచయితగా మరియు మాటలతో ఆకట్టుకున్నాడు, థ్రిల్లర్ సినిమాలకి కెమెరా వర్క్ బాగుంటేనే నచ్చుతుంది, ఆ విషయంలో విజయ్ కార్తీక్ కణ్ణన్ మంచి వర్క్ చూపించాడు. ఇక దర్శకుడు సుధీర్ వర్మ రవితేజని మంచి మాస్ లుక్ లో రెండు రకాల పాత్రలతో చూపించాడు.

చివరి మాట :

డీసెంట్ థ్రిల్లర్ & ఎంటర్టైనర్ మూవీ, ఈ వీకెండ్ కి మంచి టైంపాస్ మూవీ.

రేటింగ్ : 3.0/5.0

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support