
Phalana Abbayi Phalana Ammai Telugu Review
నటీనటులు: నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీవిద్య సంగీత దర్శకులు: కళ్యాణి మాలిక్ సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామా ఎడిటర్: కిరణ్ గంటి దర్శకుడు : శ్రీనివాస్ అవసరాల నిర్మాతలు: టి జి విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి విడుదల తేదీ : 17 మార్చ్ 2023
నాగశౌర్య హీరోగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఇంతకు ముందు "ఊహలు గుసగుసలాడే"," జ్యో అచ్యుతానంద" లాంటి సినిమాలు వచ్చాయి, ఇప్పుడు ఇదే కాబినేషన్లో మళ్ళీ "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా 2020 లో మొదలయింది కానీ ఇప్పుడు రిలీజ్ అయింది.
కథ :
ఒక జంట పదేళ్ల ప్రయాణమే ఈ కథ.. సంజయ్ (నాగ శౌర్య) , అనుపమ (మాళవిక నాయర్) ఒకే కాలేజీ లో చదువుకుంటారు, ఒక సీనియర్ ర్యాగింగ్ వళ్ళ వాళ్ళ ఇద్దరి మధ్య స్నేహం మొదలవుతుంది, అదే స్నేహం ప్రేమగా మారుతుంది, ఇలా ఇద్దరు చదువుకొని లండన్ వెళ్ళిపోతారు, అక్కడే లివిన్ రిలేషన్ షిప్ లో ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరిగి విడిపోతారు. అదే సమయంలో పూజ (మేఘా చౌదరి)తో సంజయ్ కి స్నేహం మొదలు అవుతుంది, ఆ తర్వాత సంజయ్, అనుపమ మధ్య దూరం పెరుగుతుంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ ఇద్దరూ కలిసినప్పుడు వీరి మధ్య ఏం జరుగుతుంది? మధ్యలో గిరి (శ్రీనివాస్ అవసరాల) పాత్ర ఏమిటి? చివరకు సంజయ్, అనుపమ కలిశారా లేదా అనేది మిగిలిన కథ.
నటీ - నటుల & సాంకేతిక నిపుణుల పని తీరు :
లవ్ స్టోరీస్ లో ముఖ్యంగా ఉండాల్సింది హీరో & హీరోయిన్ మద్య కెమిస్ట్రీ ముఖ్యం, ఇక్కడ ఇదే కొంత ప్లస్ పాయింట్, నాగ శౌర్య & మాళవిక 10 సం. జర్నీలో అన్ని రకాల ఎమోషన్స్ ని చూపించారు, ఇక ఈ సినిమాలో ఈ రెండు పాత్రలే ప్రధామైన స్టోరీగా ఉంది, ఇద్దరు కూడా తమ తమ పాత్రలలో ఒదిగి పోయి చక్కగా నటించారు, ప్రధాన సమస్య ఏంటి అంటే స్టోరీ కొంచెం పాత దానిలా అనిపిస్తుంది, కథలో బలం లేదు.
కాకపోతే ప్రధాన పాత్రల మధ్య లాంగ్ జర్నీని దర్శకుడు శ్రీనివాస్ అవసరాల బాగా ఎలివేట్ చేశాడు. అదే విధంగా హీరోయిన్ గా నటించిన మాళవిక నాయర్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. ప్రేమ & ఎమోషనల్ సన్నివేశాల్లో తన పెర్ఫార్మెన్స్ తో మాళవిక చాలా బాగా మెప్పించింది. అభిషేక్ మహర్షి, శ్రీవిద్య కూడా చాలా బాగా నటించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.
కథనంలో కూడా చాలా లోపాలు కనిపిస్తాయి, మొత్తం మీద స్టోరీ బాగున్నప్పటకీ కథనం అంతా పాతదే కావడంతో తదుపరి వచ్చే సీన్స్ ఈజీగా తెలిసిపోతుంటాయి, అలానే ట్విస్టులు, థ్రిల్లింగ్ అంశాలు మూవీలో మిస్ అయ్యాయి, ఈజీగా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది తెలిసిపోయేలా స్టోరీ ఉంది. సాంకేతిక విభాగం పనితీరు బాగానే ఉంది. సినిమాలోని సినిమాటోగ్రఫీ పరంగా ఎంతో అందంగా చూపించారు సునీల్ కుమార్ నామా. కళ్యాణి మాలిక్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, ఫీల్ గుడ్ bgm, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తన గత సినిమాల మాదిరిగానే ఈ మూవీని కూడా అందంగా తీసాడు, కాకపోతే స్టోరీ లైన్ మరియు సాగదీత వల్ల సినిమా బోరింగ్ గా అనిపిస్తుంది. సినిమా నిర్మాణ పరంగా బాగుంది.
ఓవరాల్ గా ఈ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ కొన్ని చోట్ల ఓకే అనిపిస్తుంది, ఎమోషనల్ & లవ్ డ్రామా సినిమాలు ఇష్ట పడే వారికి కొన్ని సీన్స్ కనెక్ట్ అవ్వొచ్చు, బోర్ కొడితే సినిమాకు వెళ్లొచ్చు కాకపోతే ఇది చూస్తున్నా కూడా బోర్ కొట్టొచ్చు! అదన్న మాట సంగతి!!
Rating : 2.0 / 5.0