రివ్యూ: సిఎస్ఐ సనాతన్ తెలుగు సినిమా


CSI Sanatan movie review

నటీనటులు : ఆది సాయికుమార్,అలీ రెజా, మిషా నారంగ్, నందిని రాయ్, తారక్ పొన్నప్ప, మ‌ధు సూద‌న్, వాసంతి (బిగ్ బాస్ ), ఖయ్యుమ్, రవిశంకర్ త‌దిత‌రులు. సినిమాటోగ్రఫీ : జి. శేఖర్ సంగీతం : అనీష్ సోలోమాన్ రచన - ద‌ర్శ‌క‌త్వం : శివశంకర్ నిర్మాత‌ : అజయ్ శ్రీనివాస్ విడుదల తేదీ : మార్చి 10, 2023

కథ :

వివేక్ చక్రవర్తి (తారక్ పొన్నప్ప) ఒక ఫైనాన్స్ (VC Finance ) కంపెనీకి CEO. మధ్య తరగతి ప్రజలకు తక్కువ వడ్డీ కి రుణాల పేరుతో తక్కువ కాలంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. ఇతను అనుకోకుండా ఒక రాత్రి పార్టీ తర్వాత అనుమానాస్పద స్థితిలో హత్య చేయబడతాడు. ఈ కేసును పోలీసులు క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సిఎస్ఐ) అధికారి సనాతన్ (ఆది సాయి కుమార్)కు అప్పగిస్తారు. సనాతన్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కంపెనీలో పార్టనర్ అయిన దివ్య (నందినీ రాయ్), ఉద్యోగులు లాస్య (బిగ్ బాస్ వాసంతి), సుదీక్ష (మిషా నారంగ్) ఇలా మరి కొందరిని అనుమానిస్తూ ఉంటాడు. అలాగే మంత్రి రాజవర్ధన్ (మధుసూదన్ రావు) కూడా కంపెనీలో భాగస్వామి అని తెలిసి అతన్ని కూడా అనుమానిస్తాడు.

విక్రమ్ చక్రవర్తి పదేళ్ళలో ఐదు వేల కోట్ల కంపెనీకి సీఈవో ఎలా అయ్యాడు? విక్రమ్, దివ్య మధ్య సంబంధం ఏమిటి? విక్రమ్ చక్రవర్తిని ఎవరు చంపారు? సనాతన్ మరియు సుధీక్ష మధ్య ఏం జరిగింది, ఈ ఇన్వెస్టిగేషన్ లో హీరో & హీరోయిన్ పాత్ర ఏంటి? అసలు వివేక్ ని హత్య చేసింది ఎవరు & ఎందుకు చంపారు, అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ & నటి నటుల పని తీరు :

హిట్ - ప్లాప్స్ పక్కన పెడితే ఆది నటుడుగా మాత్రం ప్రతి సినిమాకి చాలా బెటర్ అవుతున్నాడని చెప్పాలి. ఇదే రకంగా ఈ చిత్రంలో కూడా ఆది ఒక కొత్త రకం పాత్రలో చూడొచ్చు. చాలా డిఫరెంట్ గా ఓ సీరియస్ రోల్ లో కనిపించాడు, సీరియస్ సన్నివేశాల్లో కానీ, సెంటిమెంటల్ సీన్స్ లో కానీ చక్కగా నటించాడు.

మిషా నారంగ్ స్క్రీన్ స్పేస్ తక్కువే. అలాగే నందిని రాయ్ ఒక ఇంపార్టెంట్ పాత్రలో నటించారు, ఇక బిగ్ బాస్ వాసంతి పాత్ర కూడా చిన్న పాత్రనే, అలాగే నటుడు బిగ్ బాస్ ఆలీ రెజా కి ఈ చిత్రంలో మంచి పాత్ర దక్కింది అని చెప్పొచ్చు.

ఇక మిగిలిన యాక్టర్స్ తమ తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

'సిఎస్ఐ సనాతన్' కాన్సెప్ట్ బావుంది. ఆ కథను స్క్రీన్ మీదకు తీసుకు వచ్చే క్రమంలో కొన్ని తప్పులు జరిగాయి. కొన్ని రిపీటెడ్ సీన్స్ ఉన్నాయి, కథ చెప్పడం మళ్ళీ అవే సీన్స్ రిపీటడ్ గా రావడం కొంత బోరింగ్ ఇక్కడ.

అలాగే స్క్రీన్ ప్లే లో కూడా చాలా తప్పులు కనబడుతాయి, థ్రిల్లింగ్ సినిమాలకి స్క్రీన్ ప్లే మరియు బాక్గ్రౌండ్ మ్యూజిక్ వీక్ ఉంటె సినిమా అనుకున్నంత రీచ్ ఉండదు. లాజిక్ లేని సీన్స్ & కొన్ని అనవసర డైలాగులతో కొంత చెడగొట్టారు సినిమాని.

స్క్రీన్ ప్లే, డైరెక్షన్ లో లోపాలు సినిమాపై ఆసక్తిని తగ్గించేస్తాయి.

డైరెక్టర్ మరియు రైటర్ కలిసి కొన్ని చేంజెస్ చేస్తూ కథని ఇంకాస్త డెవలప్ చేసి ఉంటె తప్పకుండ హిట్ అయి ఉండేది.

ఫైనల్ గా CSI సనాతన్ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది, థ్రిల్లర్ సినిమాలు ఎంజాయ్ చేసే వారు ఎలాంటి ఎక్సపెక్టషన్స్ లేకుండా వెళ్తే చూడొచ్చు.

Rating : 2.5 / 5.0

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support