
Shehzada - Extra Buzz Telugu Review
అల్లు అర్జున్ నటించిన "అల వైకుంఠపురం లో" సినిమాకి రీమేక్ సినిమానే ఈ షెహజాదా సినిమా.
చిత్రం : షెహజాదా
నటీనటులు : కార్తీక్ ఆర్యన్, కృతి సనన్, పరేష్ రావల్, మనీషా కొయిరాలా, రోనిత్ రాయ్.
నిర్మాత : భూషణ్ కుమార్, అల్లు అరవింద్ ఎస్ రాధా కృష్ణ, అమన్ గిల్, కార్తీక్ ఆర్యన్
దర్శకత్వం : రోహిత్ ధావన్
సంగీతం : ప్రీతమ్
అందరికి తెలిసిన స్టోరీ అయినా మళ్లీ చెప్తున్నా వినండి..వాల్మీకి( పరేష్ రావల్ ) తన కొడుకు గొప్ప వాడిగా పెరగాలని చేసిన తప్పుడు పని వల్ల బంటు ( కార్తీక్ ఆర్యన్) తన ఇంట్లో పెరుగుతాడు. అలాగే బంటు పని చేసే ఆఫీస్ బాస్ ఐన సమైరా (కృతి సనన్) ప్రేమలో పడతాడు. తర్వాత బంటుకి వాల్మీకి తన తండ్రి కాదు అని ఎలా తెలుస్తుంది, తన సొంత తల్లి తండ్రులని ఎలా కలుస్తాడు, వాల్మీకి చేసిన తప్పు ఏంటి, చివరికి ఆ తప్పులని ఎవరు సరి దిద్దుతారు. ఇవి అన్ని చూడాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. ఒరిజినల్ అల వైకుంఠపురం సినిమానే చూడడం కష్టం అంటే మళ్లీ దాన్ని రీమేక్ చేసేసారు.
నిజానికి ఇందులో స్టోరీ పాత స్టోరీనే. నచ్చేవి ఏమైనా ఉన్నాయి అంటే అవి పాటలు మరియు త్రివిక్రమ్ మాటలు. త్రివిక్రమ్ & అల్లు అర్జున్ కోసం మాత్రమే ఈ సినిమా చూసిన జనాలు ఎక్కువ. ఇక ఈ సినిమాని రీమేక్ చేస్తే చూడడం ఇంకా కష్టం, తెలుగు సినిమాకి దీనికి పెద్దగా స్టోరీ పరంగా మార్పులు ఏం లేవు, కానీ హిందీ నేటివిటీ కి తగ్గట్టు మార్పులు చేయక తప్పదు. డైరెక్టర్ రోహిత్ ధావన్ తన వంతు ప్రయత్నం అయితే బాగానే చేసాడు, కార్తీక్ ఆర్యన్ ని అల్లు అర్జున్ తో compare చేయలేను కానీ పర్వాలేదు అనిపించాడు, కృతి గ్లామర్ తప్ప acting ఉండనే ఉండదు, కాక పోతే ఇక్కడ మిగిలిన నటీ నటులు గొప్ప నటీ నటులు. వాళ్ళు మాత్రం తమ తమ పాత్రలకి న్యాయం చేసేసారు.
ప్లస్ పాయింట్స్: తెలుగు హిట్ సినిమా, కాస్టింగ్( హీరో&హీరోయిన్ తప్ప), మ్యూజిక్, ప్రొడక్షన్
మైనస్ పాయింట్స్: స్టోరీ లేని స్టోరీ, లాగ్ సీన్స్, బోరింగ్ కామెడీ
Verdict : చూడకపోవడమే మంచిది, చూడాలనిపిస్తే మీ ఖర్మ.
Rating : 1.0 / 5.0